జాబ్స్ కోసం ఎదురుచూపుల్లో ఉన్నారా.. అయితే ఈ ఛాన్స్ మిస్ మాత్రం మిస్ కావద్దు. పూర్తి వివరాలు మీకోసమే.. !
ప్రవేట్ జాబ్ కోసం ఎదురుచూపుల్లో ఉన్న నిరుద్యోగుల కోసం ప్రభుత్వం జాబ్ మేళాలను నిర్వహిస్తోంది. ఈ జాబ్ మేళాలను నిరుద్యోగులు సైతం సద్వినియోగం చేసుకోవడంతో వీటి నిర్వహణ లక్ష్యం నెరవేరుతుందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాల నిర్వహణపై నిరుద్యోగులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి జాబ్ మేళా వివరాలు మీకోసమే..
డిగ్రీ పూర్తి చేసి, డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మీరు ఈ అవకాశాన్ని మిస్ అయితే సూపర్ జాబ్ మిస్ అయినట్లే. ఇంతకు ఈ జాబ్ మేళా పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ జాబ్ మేళాలో పాల్గొని ఎంపికయ్యారా.. సూపర్ ప్యాకేజ్ అంటూ ప్రకటించారు అధికారులు. ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు పలు అర్హతలను సైతం వారు తెలిపారు. ఇంటర్ లో CEC, MPC, BIPC సబ్జెక్ట్ తీసుకున్న వారు వీటికి సంబంధించిన విభాగంపై, డిగ్రీ పొంది ఉంటే అర్హులని తెలిపారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 19వ తేదీన ఉదయం 10 గం టలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సి పల్ మధుసూదనవర్మ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. డిగ్రీ, బీఎస్సీ, బీకాం, బీఏ, బీసీఏ, బీబీసీ, పాస్ అవుట్ విద్యార్థులు, డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు 25 సంవత్సరాల వయస్సు లోపు కలిగి ఉండాలన్నారు. ఇంటర్వ్యూలో ఎంపికై న వారు ఆంధ్ర, తెలంగాణలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఏడాదికి రూ. 2.6 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వేతనం ఉంటుందని, మేళాకు ఏ కళాశాల విద్యార్థులైనా హాజరు కావచ్చన్నారు. హాజరయ్యే వారు బయోడేటాతో పాటు ఆధార్ కార్డు, ఫొటోలు, సర్టిఫికెట్లు, మార్కుల లిస్టు.. మొదలైన వాటిని తీసుకురావాలన్నారు. పూర్తి వివరాలకు 73865 55444, 93468 26492 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.
No comments:
Post a Comment