Mother Tongue

Read it Mother Tongue

Thursday, 11 July 2024

సెయిల్, ఓఎన్జీసీలో ఉద్యోగాలు.. భారీగా జీతం.. వెంటనే అప్లయ్ చేసుకోండి

 ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)లో 249 మేనేజ్ మెంట్ ట్రైనీ(టెక్నికల్) పోస్టులు,ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిటెడ్ (ONGC)లో 79 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి.

ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)లో 249 మేనేజ్ మెంట్ ట్రైనీ(టెక్నికల్) పోస్టులు,ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిటెడ్ (ONGC)లో 79 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. సెయిల్ లోని 249 పోస్టులలో..జనరల్‌ 103, ఓబీసీ 67, ఈడబ్ల్యూఎస్‌ 24, ఎస్సీ 37, ఎస్టీ 18 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను “sailcareers.com"లో చెక్ చేయవచ్చు. ఇక,ఓఎన్జీసీలో మొత్తం 79 జూనియర్ కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టులకు రిక్రూట్ మెంట్ జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని “ongcindia.com/web/hi/career/recruitment-notice"లో చెక్ చేయవచ్చు.

విద్యార్హత

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీలో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థుల గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు ఉండాలి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిటెడ్ (ONGC)లో జూనియర్ కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టులకు ITI లేదా డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి. ఇది కాకుండా, పని అనుభవం కూడా అవసరం. గరిష్ఠ వయోపరిమితి 64 సంవత్సరాలు.

ఎంపిక ప్రక్రియ

సెయిల్ లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) పోస్టులకు మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. గేట్ 2024 పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేయబడుతుంది. దీని ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిటెడ్ (ONGC)లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఎంత జీతం

(సెయిల్ లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్)కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50 వేల వరకు జీతం ఉంటెంది. ఒక సంవత్సరం ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్‌గా పోస్ట్ చేయబడతారు. అప్పుడు వారి జీతం రూ.60 వేల నుంచి రూ.1 లక్షా 80 వేల వరకు ఉంటుంది. మరోవైపు,ONGCలో జూనియర్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.40 వేలు, అసోసియేట్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.66 వేలు జీతం లభిస్తుంది.



4 comments:

Job Alerts and Study Materials