అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో ఉంటుంది. ముందు ఆన్‌లైన్ రాత పరీక్ష, తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు.
మీరు బ్యాంకింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా..? ఫ్యూచర్‌లో ఇండస్ట్రీలో బెస్ట్ పొజిషన్‌కు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారా..? అయితే మీకు ఒక గుడ్‌న్యూస్. బ్యాకింగ్ సెక్టార్‌లో పని విధానం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్. తాజాగా ఈ బ్యాంక్ అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ అధికారిక పోర్టల్ విజిట్ చేసి జులై 14లోపు దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్‌మెంట్ గురించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం.
* ఖాళీల వివరాలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 2700 మంది అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
* వయోపరిమితి
దరఖాస్తుదారుల వయసు 20 నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. అంటే 1996 జూన్ 30 నుంచి 2004 జూన్ 30 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
బ్యాచిలర్ డిగ్రీ చదివినవారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అప్రెంటీస్‌షిప్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
* సెలక్షన్ ప్రాసెస్
అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో ఉంటుంది. ముందు ఆన్‌లైన్ రాత పరీక్ష, తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తరువాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అన్నింట్లో మెరిట్‌లో ఉన్నవారిని సెలక్ట్ చేస్తారు. ఆన్‌లైన్ ఎగ్జామ్ జులై 28న నిర్వహిస్తారు.
* అప్లికేషన్ ప్రాసెస్
- ముందుగా పీఎన్‌బీ అధికారిక పోర్టల్ pnbindia.in ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలోకి వెళ్లి, ‘రిక్రూట్‌మెంట్’ అనే ఆప్షన్ ట్యాప్ చేయాలి.
- ఆ తరువాత ‘పీఎన్‌బీ అప్రెంటీస్‌షిప్-2024’ అనే లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.
- ‘అప్లై నౌ’ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ముందు వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
- రిజిస్టర్ ఐడీతో లాంగిన్ అయ్యి, అప్లికేషన్ యాక్సెస్ చేయండి. దీంట్లో అన్ని వివరాలను ఎంటర్ చేయాలి.
- తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.
* అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.944, ఎస్సీ, ఎస్టీ, మహిళ అభ్యర్థులు రూ.708, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.472 ఫీజుగా చెల్లించాలి.
* ఎగ్జామ్ ప్యాట్రన్
ఆన్‌లైన్ రాత పరీక్ష 100 మార్కులకు MCQ మోడల్‌లో ఉంటుంది. మొత్తంగా నాలుగు సెక్షన్స్.. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటాయి. ఒక్కో సెక్షన్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.
* ట్రైనింగ్ అండ్ స్టైఫండ్
ఎంపికయ్యే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా పీఎన్‌బీ బ్రాంచ్‌ల్లో 52 వారాల పాటు ట్రైనింగ్ ఇస్తారు. అభ్యర్థుల స్టైఫండ్ అనేది ట్రైనింగ్ లొకేషన్ ఆధారంగా ఉంటుంది. మెట్రో సిటీస్ బ్రాంచ్‌ల్లో ట్రైనింగ్ పొందే అభ్యర్థులకు నెలకు స్టైఫండ్ రూ.15000 లభిస్తుంది. అర్బన్‌లో రూ.12000, రూరల్/సెబీ అర్బన్‌లో రూ.10000 స్టైఫండ్ ఉంటుంది.
Sir, madam please I want to job
ReplyDelete