ఏ నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణ ఆకాంక్షకు బలమైన కారణమైందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన జాబ్ క్యాలండర్‌ను ప్రకటించబోతున్నామని చెప్పారు.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్నదే ప్రజా ప్రభుత్వం మొదటి
ప్రాధాన్యత అని మంత్రివర్గ సహచరులతో కలిసి ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన
“రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం” కార్యక్రమాన్ని నిన్న సీఎం లాంఛనంగా
ప్రారంభించి ప్రసంగించారు.
సింగరేణి సంస్థ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో సివిల్స్‌లో ప్రిలిమ్స్
సాధించి మెయిన్స్‌కు ఎంపికైన యువతీ యువకులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక
సహాయం అందజేస్తామన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే చిత్తశుద్ధితో 30 వేల ఖాళీలను భర్తీ
చేసి నియామక పత్రాలను అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఏ నిరుద్యోగ సమస్య
అయితే తెలంగాణ ఆకాంక్షకు బలమైన కారణమైందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా
అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన జాబ్ క్యాలండర్‌ను ప్రకటించబోతున్నామని
చెప్పారు.
ప్రతి ఏటా మార్చి 31 లోగా అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను తెప్పించి జూన్ 2
నాటికి నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోపు నియామక పత్రాలను ఎంపికైన
అభ్యర్థుల చేతుల్లో పెట్టాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని సీఎం చెప్పారు.
అయితే ఈ క్యాలెండర్ లో దాదాపు 50 వేల పోస్టులతో నోటిఫికేషన్స్ విడుదల
కానున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వానికి అందిని ఖాళీ పోస్టుల్లో.. మోడల్
స్కూల్స్ లో 707 పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో 600 పోస్టులు, డైట్ కాలేజీలు,
ఎస్సీఈఆర్టీ లో 110 పోస్టులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
వీటితో పాటు.. వివిధ శాఖల్లో ఖాళీ పోస్టులు సంఖ్యపై త్వరలోనే స్పష్టత
రానుంది. డీఎస్సీ ద్వారా మొత్తం 6 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు.
వీటికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జనవరి లేదా ఫిబ్రవరి నెలలో విడుదల
కానుందని ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ను ప్రకటించనున్నారు.
No comments:
Post a Comment