Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 31 July 2024

ఆ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తులు.. జీతం రూ.50 వేలు..

 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేఫన్ ద్వారా గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేఫన్ ద్వారా గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దరఖాస్తు చేసే అభ్యర్థులు యూజీసీ నెట్ అర్హత సాధించి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మాస్టర్ డిగ్రీలో 55 శాతం మార్కులు ఉండాలి.

లేదా తత్సమాన డిగ్రీ/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/సీఏ/పీజీడీఎం/ఐసీడబ్ల్యూఏ/ఎం.కామ్ / ఎంఏలో డిగ్రీతో పాటు రెండేళ్ల టీచింగ్‌ అనుభవం తప్పనిసరి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

అభ్యర్థులు తమ జిరాక్స్ సర్టిఫికేట్లను ‘స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్,హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ’కి పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది. లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఈ మెయిల్ head.deet@uohyd.ac.in కు ఆన్ లైన్ లో సర్టిఫికెట్లు పంపించవచ్చు.

హిందీ విభాగానికి సంబంధించి దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 5 వరకు సమయం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50 వేలు వేతనం అందిస్తారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలకు https://uohyd.ac.in/ వెబ్ సైట్లో తెలుసుకోవచ్చు.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials