Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 23 July 2024

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు..

 అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

నిరుద్యోగులకు అలర్ట్. కేంద్ర సాయుధ బలగాల్లో చేరి దేశ సేవ చేసే అవకాశం వచ్చింది. దేశంలో శాంతిభద్రతలు పరిరక్షించడంలో కీలకంగా వ్యవహరించే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సీఆర్‌పీఎఫ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ నియామకాలకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ crpf.gov.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు జులై 31 వరకు అవకాశం ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ గురించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం.

* ఖాళీల వివరాలు

మెడికల్ విభాగంలో జనరల్ డ్యూటీ ఆఫీసర్స్ పోస్టులు 22 భర్తీ కానున్నాయి.

* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్

దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. డాక్టర్‌గా సర్వీస్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి. ఇంటర్న్‌షిప్ కూడా చేసి ఉండాలి.

* వయోపరిమితి

అభ్యర్థుల గరిష్ట వయసు 70 ఏళ్లలోపు ఉండాలి.

* సెలక్షన్ ప్రాసెస్

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆ తరువాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. సెలక్షన్ కోసం ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు.

* ఇంటర్వ్యూ వివరాలు

జులై 31న ఇంటర్వ్యూలు జరుగుతాయి. పూణే, హైదరాబాద్, శ్రీనగర్, ఇంపాల్, గౌహతి, గాంధీనగర్‌లోని సీఆర్‌పీఎఫ్ కాంపోజిట్ హాస్పటల్‌లో ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్స్ ఒరిజినల్స్(డిగ్రీ, వయసుకు సంబంధించిన సర్టిఫికేట్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్), మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో ఇంటర్వ్యూకు అభ్యర్థులు హాజరుకావాలి.

* జీతభత్యాలు

మెడికల్ విభాగంలో జనరల్ డ్యూటీ ఆఫీసర్ పోస్ట్‌లకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.75,000 లభిస్తుంది. ఎంపికయ్యే అభ్యర్థులు సీఆర్‌పీఎఫ్ ఆసుపత్రుల్లో మూడేళ్ల పాటు సర్వీస్ అందించాల్సి ఉంటుంది. గరిష్ట వయోపరిమితిని దృష్టిలో ఉంచుకుని మరో రెండేళ్ల పాటు సర్వీస్ పొడిగించే అవకాశం ఉంటుంది.

* అప్లికేషన్ ప్రాసెస్

- ముందుగా సీఆర్‌పీఎఫ్ అధికారిక పోర్టల్ crpf.gov.in ఓపెన్ చేయాలి.

- హోమ్‌పేజీలోకి వెళ్లి, సీఆర్‌పీఎఫ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్-2024 అనే లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.

- ఆ తరువాత ‘అప్లై నౌ’ ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

- ముందుగా వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.

- రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

- అన్ని వివరాలను ఎంటర్ చేసి అప్లికేషన్ ఫిలప్ చేయాలి.

- అవసరమైన డాక్యుమెంట్స్‌తో అప్లికేషన్‌ను ఇంటర్వ్యూ సమయంలో సబ్‌మిట్ చేయాలి.

* అప్లికేషన్ ఫీజు

సీఆర్‌పీఎఫ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

*ఉద్యోగ బాధ్యతలు

జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫసర్ పోస్ట్‌లకు ఎంపికయ్యే వారు మూడేళ్ల పాటు సీఆర్‌పీఎఫ్ ఆసుపత్రుల్లో సర్వీస్ అందించాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్స్, అధికారులకు చికిత్స అందించాల్సి ఉంటుంది.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials