అభ్యర్థులు తమ దరఖాస్తులను జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీ లోగా కార్యాలయం పని వేళల్లో సమర్పించాల్సి ఉంటుందన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఉపాధ్యాయులకు అలర్ట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ గా విధులు నిర్వహించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీఎస్ డబ్ల్యూర్ఐఎస్ జిల్లా కోఆర్డి నేటర్ డా.ఐ శ్రీదేవి తెలిపారు. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియం నందు పార్ట్ టైం (తాత్కాలిక) టీచర్‌గా విభిన్న స్థాయిల్లో ( జేఎల్/పీజీటీ/టీజీటీ ) పనిచేసేందుకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు పార్ట్ టైం టీచర్లుగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో ముఖ్యంగా జేల్ 02 (మ్యాథ్స్ 01, ఫిజిక్స్ 01 ), పీజీటీ 04 ( మ్యాథ్స్ 03, ఇంగ్లిషు 01 ), టీజీటీ 04 ( ఇం గ్లిషు 02, ఫిజికల్ సైన్స్ 02 ) ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అదే విధంగా బాలికల పాఠశాలల్లో మహిళలకు బాలుర పాఠశాలలో పురుష అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.ఆసక్తి కలిగిన అభ్యర్థులు పీజీ, బీఎడ్ లో కనీసం ద్వితీయ శ్రేణి ఉత్తీర్ణత, టెట్లో అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు.
అభ్యర్థులు తమ దరఖాస్తులను జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీ లోగా కార్యాలయం పని వేళల్లో సమర్పించాల్సి ఉంటుందన్నారు.దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి జిల్లా డిసిఒ కార్యాలయంలో డెమో నిర్వహిస్తామని తెలిపారు.ఆసక్తి కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం జిల్లా కార్యాలయం లేదా 08518295601 అనే నంబర్ కు ఫోన్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు.
గమనిక :- పైన తెలిపిన వివరాల మేరకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంపికైన వారికి మాత్రమే డెమో నిర్వహించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. అదే విధంగా అభ్యర్థులు కార్యాలయం పని వేళల్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మిగతా సెలవు దినాల్లో ఎలాంటి దరఖాస్తులు స్వీకరించరు.
No comments:
Post a Comment