ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 381 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 381 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ ఆగస్టు 14,2024.
ఆర్మీ SSC టెక్ రిక్రూట్ మెంట్ 2024 కింద పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ విషయాలు తెలుసుకోవాలి
పోస్టుల వివరాలు
SSC (టెక్) పురుషులు - 350 పోస్టులు
SSC (టెక్) మహిళలు - 29 పోస్టులు
SSCW టెక్- 1 పోస్ట్
SSCW నాన్-టెక్ 1
వయోపరిమితి
ఈ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయోపరిమితి 20 సంవత్సరాలు,గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు ఉండాలి.
విద్యార్హత
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరూ అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత అర్హతలను కలిగి ఉండాలి. అప్పుడే వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణించబడతారు.
దరఖాస్తు రుసుము ఎంత
జనరల్/ఓబీసీ - దరఖాస్తు రుసుము లేదు
SC/ST - దరఖాస్తు రుసుము లేదు
ఎంపిక ప్రక్రియ
షార్ట్‌లిస్టింగ్
SSB
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
మెడికల్ టెస్ట్
అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడండి
Indian Army Recruitment 2024నోటిఫికేషన్ Indian Army Recruitment 2024 అప్లయ్ చేయడానికి లింక్
దేశంలోని యంగ్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ భారత సైన్యంలో అధికారులుగా సేవలందించడాననికి షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC టెక్ ఎంట్రీ) అవకాశం కల్పిస్తుంది. ఇండియన్ ఆర్మీ SSC టెక్ జాబ్ ప్రొఫైల్‌లో ఫీల్డ్ ఇంజనీర్ (ఇంజనీరింగ్ కార్ప్స్), ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్ (EME కార్ప్స్) లేదా కమ్యూనికేషన్ ఇంజనీర్ (సిగ్నల్ కార్ప్స్) వంటి ఉద్యోగాలు ఉంటాయి. అభ్యర్థి ఎంచుకున్న ఇంజనీరింగ్ బ్రాంచ్ ఆధారంగా ఈ ఉద్యోగాల్లో చేరవచ్చు. ఈ పోస్టులకు మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది. శాశ్వత ఉద్యోగిగా కన్ఫర్మేషన్ అందుకున్న తర్వాత వారి పనితీరు, సీనియారిటీ, అనుభవం ఆధారంగా పదోన్నతి పొందవచ్చు. ఇందుకు ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్‌లో పాల్గొనాలి. SSC టెక్ ఆఫీసర్లు ప్రమోషన్ ద్వారా కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ వంటి ర్యాంకులకు చేరుకోవచ్చు.
No comments:
Post a Comment