అర్హులైన అభ్య ర్థులు అగ్నివీర్ పథకంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ విభాగంలో ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మజ తెలిపారు.
ఇంటర్, మూడేళ్లు ఇంజనీరింగ్, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది… ఎయిర్ పోర్స్ లో జాబ్స్ కలవు.. మంచి ఫిట్నెస్, అర్హతలో 50 శాతం మార్కులు ఉంటే చాలు ఈ జాబ్ కి అర్హులు.. కానీ ఒక కండిషన్ పెళ్లి కాని వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. పెళ్లి అయిన వారు ఈ జాబ్ కు అర్హులు కారు. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ కొంచెం తెలివి ప్రదర్శిస్తే చాలు నీడలో కూర్చొని జాబ్చేసుకోవచ్చు. మంచి పరపతి గల జాబ్ సమాజంలో మంచి పేరు ఉంటుంది మనకి.ఒకసారి ట్రై చేయండి జాబ్ కొట్టండి.
చిత్తూరుజిల్లాలో అర్హులైన అభ్య ర్థులు అగ్నివీర్ పథకంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ విభాగంలో ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మజ తెలిపారు.ఆమె విలేకరులతో మాట్లాడుతూ 21 ఏళ్లలోపు ఉండి 50 శాతం మార్కులతో గణితం, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జె క్టులతో ఇంటర్, మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొ మాతో సమానమైన విద్యార్హతలు కలిగి ఉండాలన్నారు.
వివాహం కాని పురుష, మహిళా అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్లో రాతపరీక్ష ఫిజికల్, మెడికల్ ఫిట్నెస్ పరీక్షలతో పాటు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. వివరాలజు www.afnipathvayucdac.in వెబ్ సైట్ లోపరిశీలించాలని సూచించారు.
No comments:
Post a Comment