మీకు వెంటనే గవర్నమెంట్ జాబ్ కావాలా.. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు.. మీకు జాబ్ గ్యారంటీ. ఇంతకు ఏంటా అవకాశం.. ఎలా అనే సందేహాలు మీ మదిలో మెదిలాయా.. అయితే ఇదిగో మీకోసమే ఈ వివరాలు.. !
చాలా మందికి పదవ తరగతి పూర్తి కాగానే ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే ఆశ ఉంటుంది. అటువంటి వారి కోసం ఎన్నో కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అలాంటి కోర్సులలో ప్రధానంగా చెప్పుకోదగ్గది వెటర్నరీ పాలిటెక్నిక్ కోర్సు. ఈ కోర్సు కోసం తిరుపతి శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో ఏపీ వ్యాప్తంగా పలు కళాశాలల్లోకి ప్రవేశం పొందే అవకాశం ఉంది. 10 ప్రభుత్వ కళాశాలలు కాగా.. 12 ప్రవేట్ కళాశాలల్లో ఈ విద్యను భోధిస్తున్నారు.
పదవ తరగతి పూర్తి చేసిన వారు కేవలం రెండేళ్ళు ఈ కోర్సును పూర్తి చేస్తే చాలు.. వెటర్నరీ డిపార్ట్మెంట్లో వెటర్నరీ హెల్పర్ పోస్టుకు అఅర్హత సాధిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ అవకాశాలు ఎంత మెండుగా ఉంటాయో.. అదే రీతిలో ప్రవేట్ జాబ్స్ కూడా ఆశాజనకంగా ఉంటాయి.
కాగా 2024-25 విద్యా సంవత్సరానికి గాను శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఈనెల 22 వరకు ఈ కోర్సులో చేరేందుకు అవకాశాన్ని కల్పించింది. దీనికి చేయవలసిందల్లా www.svvu.edu.in వెబ్ సైట్ లో వివరాలను నమోదు చేయడమే.
కేవలం రెండేళ్ళు కోర్సులో శిక్షణ పొందితే చాలు.. మీ జాబ్ మీ చేతిలో ఉన్నట్లే అంటున్నారు విద్యావేత్తలు. మరి ఇంటర్మీడియట్ లో చేరే స్తోమత లేక త్వరితగతిన మీ లైఫ్ సెటిల్ కావాలంటే ఈ కోర్సులో చేరండి.. అయితే సీట్లు పరిమితంగా ఉన్నాయి.. డోంట్ మిస్ దిస్ ఛాన్స్ !
No comments:
Post a Comment