నిరుద్యోగులకు బంపర్ అవకాశం. జాబ్ మేళా లో పాల్గొని, జాబ్ కొట్టే అవకాశం ఏర్పడింది. ఈ మేళాలో చాలా కంపెనీలు పాల్గొననున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నిరుద్యోగులకు బంపర్ అవకాశం. జాబ్ మేళా లో పాల్గొని, జాబ్ కొట్టే అవకాశం ఏర్పడింది. ఈ మేళాలో చాలా కంపెనీలు పాల్గొననున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని, తిరుపతి పట్టణంతి రుచానూరు రోడ్డు, పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలోని ఉప ఉపాధి కార్యాలయంలోఈ నెల 9వ తేదీ ఉదయం 10గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఎస్. వెంకటరమణ తెలిపారు.
ఈ జాబ్ మేళాలో వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొని ఆయా సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అపోలో ఫార్మసీ రీటైల్ ట్రెనీ అసోసియేట్, ఫార్మాసిస్ట్ఉద్యోగాలకు పది, ఇంటర్, డిప్లొమో, డిగ్రీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ విద్యార్హత ఉన్నవాళ్లు అర్హులుగా పేర్కొన్నారు.
శ్రీజ మిల్క్ సంస్థలో ఫీల్డ్ కెమిస్ట్ ఉద్యోగాలకు గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్, డిప్లొమో(కెమిస్ట్ మైక్రోబయాలజీ), బీటెక్( డేయిరీ బిటెక్) విద్యార్హత, బిగ్ బాస్కెట్ సంస్థలో స్కానర్, పికర్, ప్యాకెట్ ఉద్యోగాలకు పది, ఇంటర్, డిగ్రీ విద్యార్హత ఉండాలన్నారు.
అమర రాజ సంస్థలో టెక్నీషియన్ ఉద్యోగాలకు పది, ఇంటర్, ఐటీఐ విద్యార్హత ఉండాలి. రాన్స్టాండ్ సంస్థలో టెక్నీషియన్/హెల్పెర్ ఉద్యోగాలకు పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. అలాగే ఆయా సంస్థల్లో ఉద్యోగాలకు 18 నుంచి 30 ఏళ్ల లోపు వయసు కలిగిన స్త్రీ, పురుషులు అర్హులని పేర్కొన్నారు.
ఆసక్తి గల వారు పూర్తిబయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లతో జాబ్ మేళాకు హాజరవ్వాలని తెలిపారు. ఇతర వివరాలకు5 81210 15844, 89194 65770 ఈ నెంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
No comments:
Post a Comment