తెలంగాణలో పలు జిల్లాల్లో ఉపాధి శాఖ అధికారులు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నారు. జర్మనీలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయి.ఇందు కోసం ప్రభుత్వాలు పలుచోట్ల ఉచిత ఉపాధి శిక్షణలు కల్పిస్తున్నాయి. ఇటు,ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల సైతం పలుచోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. దీంతో ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులు ఉపాధి పొందుతున్నారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పలు స్వచ్ఛంద సంస్థలు నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ అందించిన అనంతరం వారికి ఉపాధి కల్పిస్తున్నాయి.ఇలా చేయడం ద్వారా ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ శిక్షణను పొంది ఉద్యోగాలు చేస్తున్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే అభ్యర్థులకు సైతం స్టడీ సెంటర్లలో ఉచిత శిక్షణను అందజేస్తుంది.ఇందులో సైతం అనేక మంది అభ్యర్థులు ఈ స్టడీ సెంటర్ లలో శిక్షణ పొంది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు.
జర్మనీలో నర్సు ఉద్యోగ కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.ఈ మేరకు జనగామ జిల్లా ఉపాధి శాఖ అధికారిణి సీహెచ్.ఉమరాణి ఒక ప్రకటనలో తెలిపారు. టామ్ కామ్ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ ఆఫ్ జర్మనీ ప్రభుత్వ భాగ్యస్వామ్యంతో ట్రిపుల్ విన్ ప్రాజెక్టు కింద జర్మనీలో నర్సింగ్ ఉద్యోగ అవకాశాల కోసం అనుభవం ఉన్నవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
21 నుంచి 38 సంవత్సరాల లోపు వయసు ఉన్న మహిళా అభ్యర్థులు ఇందుకు అర్హులన్నారు. గుర్తింపు పొందిన నర్సింగ్ కళాశాల నుంచి క్లినికల్ అనుభవం ఉన్నవారికి ఇందులో ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు. గతంలో కూడా టామ్ కామ్ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ ద్వారా పలు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానించినట్లు చెప్పారు. ఎంతోమంది అర్హులైన అభ్యర్థులు ఇందుకు దరఖాస్తు చేసుకొని ఉద్యోగాలు పొంది జర్మనీలో ఉద్యోగాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
అయితే జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు చేసేందుకు జనగామ జిల్లాకు చెందిన ఆసక్తి,అర్హత కలిగిన అభ్యర్థులు ఇందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9908830438, 8919047600,7032379066 నెంబర్ లలో సంప్రదించాలని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
No comments:
Post a Comment