రాష్ట్రంలోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలో మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖా మంత్రి వెల్లడించారు.
రాష్ట్రం ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలో మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
ఏపీ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ మంగళవారం ఉన్నత విద్య అంశంపై సంబంధిత అధికారులకో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వం యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,220 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.
పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా పోస్టుల భర్తీ ఉండాలని ఉన్నత విద్యశాఖ అధికారులకు మంత్రి సూచించారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించాలని కోరారు.
యూనివర్సిటీలకు సంబంధించి అకడమిక్ ఇయర్, ఎగ్జామినేషన్ షెడ్యూల్, క్యాలండర్ రూపొందించాలని.. నిర్ణీత సమయంలో పరీక్షలు నిర్వహణ, ఫలితాలను వెల్లడించాలని ఆదేశించారు.
రాజకీయ ప్రమేయం లేకుండా నియామకం జరగాలని.. ప్రతిభ ఆధారంగా, పారదర్శకంగా పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని సూచించారు.
No comments:
Post a Comment