తెలంగాణ డీఎస్సీ విషయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ నిరుద్యోగులకు ఖతర్నాక్ కబురు చెప్పింది ప్రభుత్వం.
తెలంగాణ డీఎస్సీ విషయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు నిర్వహించడానికి రెడీ అయింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఓ తీపి కబురు చెప్పింది ప్రభుత్వం.
ఈ నెల 18వ తేదీ (గురువారం) నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 11,062 పోస్టుల భర్తీకి గాను 2.79 లక్షల దరఖాస్తులు అందగా.. ఈ సారి పరీక్షలు ఆన్ లైన్ విధానంలో జరుగనున్నాయి. ఇప్పటికే అభ్యర్థులందరికీ హాల్ టికెట్స్ కూడా జారీ చేశారు.
అయితే మరోపక్క డీఎస్సీ నిర్వహణపై కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించడంతో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా డీఎస్సీ నిర్వహణ జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.
ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కానుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పుడు వేసిన పోస్టులే కాకుండా.. మరో 6 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించామని తెలిపారు.
ఈ 6 వేల టీచర్ పోస్టుల భర్తీ అతి త్వరలో ఉంటుందని, వచ్చే ఏడాది జనవరిలో మరో డీఎస్సీ ప్రకటన చేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుత డీఎస్సీ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరో డీఎస్సీ నోటిఫికేషన్ పై కసరత్తులు షురూ చేస్తారట.
కాబట్టి ఉద్యోగార్థులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగార్థులకు సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు హామీ ఇస్తున్నారు.
No comments:
Post a Comment