గత రెండు నెలల నుంచి గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్ష వాయిదా కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేశారు.
గత రెండు నెలల నుంచి గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్ష వాయిదా కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే, ఎంపీల వద్దకు వెళ్లి వినతి పత్రాలు ఇవ్వడం.. తర్వాత శాంతియుత ధర్నాలు చేయడం.. రోడ్లపై బైఠాయించి గ్రూప్ 2 పోస్టులను పెంచి డిసెంబర్ లో పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.
ఎట్టకేలకు జులై 18నే గ్రూప్ 2 వాయిదా నిర్ణయం వస్తుందనుకున్నా.. నేటికి ఆ కబురు వచ్చేసింది. ఎట్టకేలకు గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. డిసెంబర్ లో ఈ పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు.
అయితే దీనికి సంబంధించి పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. గ్రూప్-2 పోస్టుల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే గ్రూప్ 3 పరీక్ష నివంబర్ లో నిర్వహించనుండగా.. ఈ పరీక్షను కూడా ప్రభుత్వం వాయిదా వేసేందుకు అంగీకరించినట్లు ఎంపీ మల్లు రవి తెలిపారు.
నేడు ఈ గ్రూప్ 2 పరీక్ష వాయిదా అంశంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సచివాలయంలో అభ్యర్థులతో చర్చించారు. డీఎస్సీ పరీక్షలు జులై18 నుంచి ప్రారంభం కాగా.. ఆగస్టు 5తో ముగియనున్నాయి.
అయితే ఒక్కరోజు గ్యాప్ తోని గ్రూప్ 2 పరీక్షలు ఆగస్టు 7,8వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 అభ్యర్థులు ఈ పరీక్ష వాయిదా వేయాలని కోరారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితే ఎన్నికల ముందు గ్రూప్ 2లో అదనంగా 2000 పోస్టులను కలుపుతామని ఇచ్చిన హామీని నిరుద్యోగులు గుర్తు చేశారు. దీనిపై కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, గ్రూప్-2 అభ్యర్థులు తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.
No comments:
Post a Comment