ప్రస్తుతం బీటెక్ చదివే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. తొందరగా ఎక్కువ శాలరీలతో సెటిల్ అవ్వాలంటే.. ఈ బీటెక్ కోర్సుల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నవారి సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతోంది.
ప్రస్తుతం బీటెక్ చదివే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. తొందరగా ఎక్కువ శాలరీలతో సెటిల్ అవ్వాలంటే.. ఈ బీటెక్ కోర్సుల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నవారి సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతోంది.
సంప్రదాయ కోర్సులకు కాలం చెల్లి.. బీటెక్‌లో కొత్త కోర్సుల హవా కొనసాగుతోందనే చెప్పాలి. సమకాలీన అంశాలతో ముడిపడి.. ఉద్యోగావకాశాల డిమాండ్ ఉన్న వాటివైపే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు.
అయితే బీటెక్ లో సాంప్రదాయ కోర్సులకు యువత స్వస్తి చెబుతున్నారు. సివిల్, మెకానికల్, ఐటీ ఇంజినీరింగ్ కోర్సుల్లో గతంలో మాదిరిగా ఎక్కువ మంది చేరడం లేదు. దీంతో ఎక్కువగా వేటికి డిమాండ్ ఉన్నాయో వాటిని గుర్తించి కళాశాలలు కూడా వాటిని అందుబాటులోకి తెస్తున్నాయి.
ఇటీవల జేఎన్టీయూలో టెక్స్‌టైల్స్ ఇంజినీరింగ్ కోర్సు ప్రవేశ పెట్టారు. సింగరేణి ప్రాంతంలో ఎక్కువగా ఉపయోగపడనున్నటువంటి మైనింగ్ కోర్సులను మంథని జేఎన్టీయూలో అందుబాటులోకి తెచ్చారు.
ఇప్పుడంతా ఏఐ ట్రెండ్‌కు ప్రాధాన్యం ఉండటంతో ప్రైవేటు కళాశాలలు ఆ కోర్సులపై దృష్టి పెట్టాయి. అంతే కాకుండా.. సాఫ్ట్ వేర్ సైడ్ ఎక్కువగా డిమాండ్ ఉంటంతో.. సీఎస్ఈకి సంబంధించి మరిన్ని కోర్సులను ప్రవేశపెడుతున్నారు.
సీఎస్‌జీ (కంప్యూటర్ సైన్స్ ఆండ్ డిజైన్), సీఎస్‌ఎం (కంప్యూటర్ సైన్స్ ఆండ్ ఇంజినీరింగ్- ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మిషన్ లర్నింగ్), సీఎస్‌డీ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (డాటాసైన్స్), సీఎస్‌ఐ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లు సీఎస్‌ఈ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) కోర్సులు ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ కోర్సుల భిన్నంగా..ఇంజనీరింగ్ లో బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, బీమా(BFSI) కోర్సును ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రంగాల్లో ఎక్కువగా అవకాశాలు ఉండటంతో బీటెక్ లో దీనిని మైనర్ డిగ్రీగా ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.
BFSI ప్రతినిధులు ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. విద్యార్థులు తమ టెక్నికల్ బ్రాంచీతో పాటే.. ఈ కోర్సును కూడా చదవొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది దీనిని పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయనున్నారు.
అంతే కాకుండా.. ఇటీవల కూకట్ పల్లి జేఎన్టీయూలో కొత్తగా డబుల్ డిగ్రీ కోర్సును ప్రవేశ పెట్టింది. ఎప్పటి నుంచే వీటిని అమలు చేయానుకున్న అధికారులు ఇటీవల ప్రారంభించాలి. ఈ డబుల్ డిగ్రీ కోర్సు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రారంభించారు.
నేషనల్ ఎడ్యూకేషన్ లో భాగంగా.. జేఎన్టీయూలో సెకండ్ డిగ్రీగా బీబీఏ డీఏ (బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మిస్ట్రేషన్ ఇన్ డేటా అనాలసిస్) కోర్సును ప్రారంభించారు. మూడేండ్ల ఈ కోర్సులో చేరేందుకు బీటెక్, బీఫార్మసీ ఫస్ట్, సెకండ్ , థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అర్హులు.
No comments:
Post a Comment