ఎస్‌బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ఉచితంగానే అదిరే సేవలు అందిస్తోంది. ఉచితంగానే హాస్టల్ వసతి. ఇంకా ఫ్రీగా ట్రైనింగ్. ఆపైన ఈజీగా లోన్స్ అందిస్తోంది. ఈ అవకాశం మిస్ అవ్వొద్దు.
యువతను స్వయం ఉపాధి బాటలో చైతన్యవంతులుగా చేసి వారు స్వయం ఉపాధి ద్వారా జీవితంలో స్థిరపడాలని ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను 2010లోనెలకొల్పారు. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే నిరుద్యోగ గ్రామీణ యువత గుర్తించి చైతన్యవంతులు చేయడం వారికి తగిన శిక్షణ, సలహాలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించడం, స్వశక్తి సంఘాల అభివృద్ధికి తోడ్పడుట, గ్రామీణ ప్రాంత యువత నగరాలకు వలసలు నివారించుట, ఉన్నతమైన చదువులతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్న రంగాలలో ఉచితంగా శిక్షణ అందిస్తూ యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తుంది. కరీంనగర్, తిమ్మాపూర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యువతకు ఆయ కోర్సులు ఉచిత శిక్షణ తో పాటు హాస్టల్ వసతి కూడా కల్పిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఇక ఇది విషయంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఇన్చార్జి స్వప్న ను లోకల్ 18 పలకరించే ప్రయత్నం చేసింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు మా సంస్థ లో 9308 మంది అభ్యర్థులు శిక్షణ పొందారు. 7149 మంది వారు తీసుకున్న శిక్షణ రంగంలో స్థిరపడ్డారు. 30395 మంది తమ వ్యాపార రంగంలో రాణిస్తున్నారు..శిక్షణ సమయంలో ఉచిత వసతులు కల్పిస్తుండగా శిక్షణ తర్వాత సర్టిఫికెట్స్ అందజేసిన బ్యాంకులలో ఋణం తీసుకునే సౌకర్యాన్ని సైతం కల్పిస్తుండడం ఈ సంస్థ ప్రత్యేకత అని ఇన్చార్జ్ స్వప్న లోకల్ 18కి తెలిపారు. ఇందులో అప్లై చేయాలంటే తెలుగులో రాయడం చదవడం రావాలి. కనీసం ఏడవ తరగతి పాస్ఐ ఉండాలి. అభ్యర్థులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావాలి. వయస్సు 18 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి నేర్చుకోవాలని తపన ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులు అని తెలిపారు.. ఇలాంటి సంస్థ ఇస్తున్న శిక్షణ ప్రతి ఒక్క సద్వినియోగం చేసుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. వేసుకోవాలన్నారు.ఇక్కడ కోర్సులు వచ్చేసి పురుషులకైతే ఏసీ మెకానిక్, మోటో రివైడింగ్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, రిఫ్రిజిరేటర్లు, సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్, ఫోన్ రిపేరింగ్, కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్, డ్రైవింగ్ ఎలక్ట్రిషన్, వంటి కోర్సులు ఉంటాయి. అలాగే లేడీస్, టైలరింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఎంబ్రాయిడింగ్, బ్యూటీ పార్లర్, జ్యూట్ బ్యాగ్ తయారీ లాంటి కోర్సులు నేర్పిస్తున్నారు.కాబట్టి గ్రామీణ ప్రాంత యువతి యువకులు ఇలాంటివీ సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ సంపత్ కుమార్ తెలిపారు.
వరంగల్ లో లేదా సార్ ఇలాంటి ఆఫర్
ReplyDeleteఈ అవకాశం వరంగల్ జిల్లా పరిధిలోని మండలంలో ఎక్కడ ఉన్నదో తెలుపగలరు
ReplyDeleteWe need in Warangal
ReplyDelete