Mother Tongue

Read it Mother Tongue

Sunday, 14 July 2024

గుడ్ న్యూస్.. ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్సవ్వద్దు.. ఇలా అప్లై చేసుకోండి!

 కేంద్రంలో మళ్లీ NDA ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ఇప్పటివరకూ అమలవుతున్న పథకాలను మళ్లీ కొనసాగిస్తోంది. ఆ క్రమంలో ఇప్పుడో స్కీమ్‌కి సంబంధించి కేంద్రం డెడ్‌లైన్ విధించింది. ఆలోగా అప్లై చేసుకుంటే.. ఆ ప్రయోజనం పొందే ఛాన్స్ ఉంటుంది. ఆ పథకం వివరాలు, లాస్ట్ డేట్ అన్నీ తెలుసుకుందాం.

పథకం పేరు:
ఈ పథకం పేరు ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ వీసా (India Young Professionals Scheme Visa). బ్రిటన్ ప్రభుత్వం.. ఈ వీసా కోసం రెండో పోల్ ప్రారంభించింది. మొత్తం 3,000 మంది ఈ వీసా పొందవచ్చు. పొందే వారి వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుంది. దరఖాస్తు చేసుకునేవారు తగిన అర్హతలు కలిగివుండాలి. అలాగే తమ సేవింగ్స్ అకౌంట్‌లో £2,530 (రూ.2,68,387) కలిగివుండాలి. ఈ స్కీమ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పథకం పేరు:
ఈ పథకం పేరు ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ వీసా (India Young Professionals Scheme Visa). బ్రిటన్ ప్రభుత్వం.. ఈ వీసా కోసం రెండో పోల్ ప్రారంభించింది. మొత్తం 3,000 మంది ఈ వీసా పొందవచ్చు. పొందే వారి వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుంది. దరఖాస్తు చేసుకునేవారు తగిన అర్హతలు కలిగివుండాలి. అలాగే తమ సేవింగ్స్ అకౌంట్‌లో £2,530 (రూ.2,68,387) కలిగివుండాలి. ఈ స్కీమ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ పథకంలో ముఖ్యమైన అంశాలు:
ఆర్థికంగా, విద్యాపరంగా అవసరం అనుకునేవారు ఈ వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ వీసా ఖరీదు £298 (రూ.31,612). 2024 సంవత్సరానికి సంబంధించి 3,000 మందికి ఈ వీసా ఇస్తున్నారు. ఫిబ్రవరిలో ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు రెండోసారి బ్యాలెట్ రిలీజ్ చేశారు. ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్‌ను పూర్తిగా పరిశీలించి.. అన్ని అర్హతలూ ఉంటే, వీసా ఇస్తారు. ఐతే, అప్లికేషన్ ధర £720 (రూ.76379).

పథకం పొందేందుకు ఉండాల్సిన అర్హతలు:
దరఖాస్తుదారుకి సరైన పాస్‌పోర్ట్ ఉండాలి. దానికి కనీసం 6 నెలల వ్యాలిడిటీ ఉండాలి. వయసు 18 నుంచి 30 మధ్య ఉండాలి. కనీసం డిగ్రీ పాసై ఉండాలి. దరఖాస్తు దారుకి 18 ఏళ్లలోపు పిల్లలు ఉండకూడదు. వీసా కోసం అప్లై చేసుకునే ముందు.. ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ పోల్‌లో సెలెక్ట్ అవ్వాలి. బ్యాంక్ అకౌంట్‌లో 28 రోజులపాటూ మనీ కలిగివుండాలి.

ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ పోల్‌లో ఎలా పాల్గొనాలి:
ఈ బ్యాలెట్ పోల్‌లో పాల్గొనేందుకు కొంత సమాచారం కలిగివుండాలి. అది.. పేరు, పుట్టినరోజు, పాస్‌పోర్ట్ వివరాలు, పాస్ట్‌పోర్ట్ ఫొటో, ఫోన్ నంబర్, ఈమెయిల్. ఎంట్రీలను ర్యాండమ్ విధానంలో ఎంపిక చేస్తారు. బ్యాలెట్ క్లోజ్ అయ్యాక, 2 వారాల్లో ఫలితాలను ఈమెయిల్ ద్వారా పంపుతారు.

ఎంట్రీ పొందిన వారికి వీసా పొందే ఛాన్స్:
మీరు బ్యాలెట్‌లో ఎంపికైతే, మీరు వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. ఈమెయిల్ వచ్చినప్పటి నుంచి 90 రోజుల్లో, ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. వీసా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి, ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌ఛార్జిలు చెల్లించి, బయోమెట్రిక్స్ సబ్‌మిట్ చెయ్యాలి. పోల్‌లో ఎంపికైనా, వీసా కోసం అప్లై చేసుకోకూడదు అనుకుంటే, ఆ విషయం చెప్పాల్సిన పనిలేదు. బ్యాలెట్ పోల్‌లో ఎంపిక కాని వారు, భవిష్యత్తులో మళ్లీ పోల్‌లో పాల్గొనవచ్చు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:
మీరు యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ ప్రోగ్రామ్ కింద బ్రిటన్‌ని సందర్శించాలనుకుంటే, మీరు తప్పనిసరిగా దరఖాస్తును (https://www.gov.uk) సమర్పించాలి. మీరు తప్పనిసరిగా E-1 వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. “భారతదేశం-UK YPS ప్రోగ్రామ్ కింద దరఖాస్తు” చేసుకోవాలి. మీరు వీసా అప్లికేషన్ పేజీలో వీసా టైప్‌ని ఎంప్లాయిమెంట్ వీసాగా ఎంపిక చెయ్యాలి. Purpose categoryలో All cases of Employment (except intra-company transferees and employment in NGOs)” ఎంపిక చేసుకోవాలి. అలాగే మీ పాస్‌పోర్ట్ ఆధారిత సమాచారంతో.. అప్లికేషన్‌ని నింపాలి. అలాగే ఫ్యామిలీ వివరాల ఫారంలో “Present Occupation”లో “Others” ఎంచుకోవాలి. తర్వాతి ఫీల్డులో “India-UK YPS program” అని ఎంట్ చెయ్యాలి. మీకు ఇదివరకు బ్రిటన్ లోని ఏదైనా కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వస్తే, ఎంప్లాయర్స్ సమాచారంలో దాన్ని ఎంటర్ చెయ్యాలి. లేదా NA అని టైప్ చెయ్యాలి. మీకు ఇదివరకు ఆక్యుపేషన్ ఉంటే.. దాన్ని లిస్టులో సెలెక్ట్ చెయ్యాలి. లేదా బ్లాంక్‌గా వదిలేయాలి. మరిన్ని వివరాలు ఇక్కడ (https://www.gov.uk/india-young-professionals-scheme-visa) చూడండి.



1 comment:

  1. Ivvanni cheyyadam valla Ila apply chesukovadam valla asalu upayogam emity endhuku idhi

    ReplyDelete

Job Alerts and Study Materials