Mother Tongue

Read it Mother Tongue

Saturday, 13 July 2024

NHAI లో ఉద్యోగాలు..భారీగా జీతం..ఈ అర్హతలు ఉన్నవాళ్లు అప్లయ్ చేసుకోవచ్చు

 NHAI Recruitment 2024: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లో ప్రిన్సిపల్ DPR ఎక్స్‌పర్ట్, సీనియర్ హైవే ఎక్స్‌పర్ట్, టన్నెల్, బ్రిడ్జ్ ఎక్స్‌పర్ట్‌తో కలిపి మొత్తం 38 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లో ప్రిన్సిపల్ DPR ఎక్స్‌పర్ట్, సీనియర్ హైవే ఎక్స్‌పర్ట్, టన్నెల్, బ్రిడ్జ్ ఎక్స్‌పర్ట్‌తో కలిపి మొత్తం 38 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్లయ్ చేసుకోవడానికి జూలై 18 చివరి తేదీ. ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ.2.30 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వేతనం లభిస్తుంది.  నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) nhai.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను  ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను చూడవచ్చు.

విద్యార్హత

గ్రాడ్యుయేషన్/సివిల్ ఇంజినీరింగ్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలుగా నిర్ణయించబడింది.

జీతం

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)ఈ రిక్రూట్‌మెంట్‌ల కోసం, వివిధ పోస్టులకు వేర్వేరు వేతనాలు నిర్ణయించబడ్డాయి. ఎన్విరాన్‌మెంట్/ఫారెస్ట్ స్పెషలిస్ట్/ల్యాండ్ అక్విజిషన్ ఎక్స్‌పర్ట్/జియోటెక్నికల్ ఎక్స్‌పర్ట్  నెలవారీ జీతం రూ. 2.30 లక్షలు. రోడ్డు భద్రత నిపుణుడు/ట్రాఫిక్ నిపుణుడు నెలకు రూ. 4.50 లక్షల జీతం పొందుతారు. సీనియర్ హైవే ఎక్స్‌పర్ట్/బ్రిడ్జ్ ఎక్స్‌పర్ట్/టన్నెల్ ఎక్స్‌పర్ట్‌ల జీతం నెలకు రూ. 5.50 లక్షలు. ప్రిన్సిపల్ డిపిఆర్ ఎక్స్‌పర్ట్‌కు నెలకు రూ. 6 లక్షలు అంటే ఏడాదికి రూ.72 లక్షలు.



7 comments:

Job Alerts and Study Materials