యూపీఎస్సీ కోచింగ్‌కి లక్షల్లో ఖర్చు అవుతుంది. మరి ఫీజులు భరించలేని అభ్యర్థుల పరిస్థితి ఏంటి?
దేశంలోనే అత్యున్నతమైన సివిల్స్ సర్వీస్‌కు సెలక్ట్ అవ్వాలంటే అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాలి. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ఎగ్జామ్‌ను అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా పేర్కొంటారు. ఈ పరీక్షలో క్వాలిఫై అయ్యేందుకు చాలామంది విద్యార్థులు ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. అంతేకాకుండా యూపీఎస్సీ కోచింగ్‌కి లక్షల్లో ఖర్చు అవుతుంది. మరి ఫీజులు భరించలేని అభ్యర్థుల పరిస్థితి ఏంటి?
ప్రతి సంవత్సరం, వివిధ ఆర్థిక, విద్యా నేపథ్యాలకు చెందిన చాలా మంది అభ్యర్థులు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మొదలు పెడుతుంటారు. అయితే స్టడీ మెటీరియల్, ఆన్‌లైన్ పోర్టల్‌లు, యూట్యూబ్ వీడియోలు ఎక్కడి నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టాలో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి వారికి సహాయం చేయడానికి అనేక ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఉచితంగా సివిల్ సర్వీస్ కోచింగ్ ఇస్తున్నాయి. ఈ కోచింగ్ ఉచితంగా ఎక్కడ అందిస్తున్నారు, సీట్ల సంఖ్య, అడ్మిషన్ ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* జామియా మిలియా ఇస్లామియా యూపీఎస్సీ కోచింగ్ సెంటర్
భారతదేశంలో మొట్టమొదటి ఉచిత కోచింగ్ సెంటర్ జామియా మిలియా ఇస్లామియా UPSC కోచింగ్ సెంటర్. యూపీఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ అందించేందుకు రెసిడెన్షియల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఈ సంస్థ నుంచి చాలా మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌కి ఎంపికవుతారు.
ఈ సంవత్సరం యూపీఎస్సీ కోచింగ్‌లో ప్రవేశానికి జామియా మిలియా ఇస్లామియాలో 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశం పొందిన విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. హాస్టల్ ఫీజు కోసం నెలకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నెలల అడ్వాన్స్ ఫీజు రూ.6000 తీసుకుంటారు. రెండు నెలల మెయింటెనెన్స్ ఫీజును కూడా అడ్వాన్స్‌గా చెల్లించాలి. మహిళా అభ్యర్థులకు, ఫీజు బాలికల హాస్టల్/ప్రోవోస్ట్ కార్యాలయంలో జమ అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికి, మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు.
* అడ్మిషన్ ఎలా పొందాలి?
జామియా మిలియా ఇస్లామియా కోచింగ్ సెంటర్‌లో ప్రవేశం పొందాలంటే విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాలి. జూన్ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
* ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉచిత కోచింగ్
భారతదేశంలో రెండో ఉచిత కోచింగ్ సెంటర్ ఉత్తర్‌ప్రదేశ్ సోషల్ వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్ నిర్వహిస్తోంది. ఇక్కడ SC, ST, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన, మైనారిటీ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులకు మాత్రమే కోచింగ్‌ను అందిస్తారు. ఈ కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ పొందేందుకు, అభ్యర్థులు socialwelfareup.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్ అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులు పూర్తి యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపరేషన్ శిక్షణ అందుకుంటారు.
సెంటర్ వారీగా అందుబాటులోని సీట్లు:
- ఛత్రపతి షాహూ జీ మహారాజ్ శోధ్ అవమ్ ప్రశిక్షన్ సంస్థాన్ భగీదారి భవన్, లక్నోలో 250 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- ఆదర్శ్ పూర్వ పరీక్షన్ కేంద్రం అలీగంజ్, లక్నో (మహిళలకు మాత్రమే) 150 సీట్లు ఉన్నాయి.
- IAS/PSC కోచింగ్ సెంటర్, హాపూర్ ఘజియాబాద్‌లో 200 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- సంత్ రవిదాస్ IAS/PSC కోచింగ్ సెంటర్ వారణాసిలో 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- బీఆర్ అంబేద్కర్ కోచింగ్, ఆగ్రాలో 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- ప్రయాగ్‌రాజ్ సెంటర్‌లో 50 సీట్లు ఉన్నాయి.
- గోరఖ్‌పూర్ సెంటర్‌లో 100 సీట్లు ఉన్నాయి.
- బీఆర్ అంబేద్కర్ కోచింగ్, అలీఘర్‌లో 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
No comments:
Post a Comment