నిరుద్యోగులకు భారీ శుభవార్త. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిని దరఖాస్తులు ఈ నెల 28వ తేదీలోపు చేసుకోవాలి.
ప్రైమరీ స్థాయిలో ఆటల్లో పాల్గొని, చురుగ్గా అన్ని సాంస్కృతిక రంగాల్లో రాణిస్తూ, బాడీ ఫిట్నెస్ ఉండి, మంచి వాక్ చాతుర్యం ఉండి కింది స్థాయి నుండి కొన్ని భాషల్లో పట్టు కలిగిన వారు, అదే విధంగా ఇంటర్, డిగ్రీ, డిప్లొమో వంటి కోర్సుల్లో 50 శాతం మార్కులు పొందిన వారికి ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ఇందులో ఎంపిక అయి జాబ్ వరిస్తే మంచి శాలరీ కూడా ఉంటుందన్నారు. ఇదే క్రమంలోనే చిత్తూరుజిల్లాలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎయిర్ఫోర్స్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి పద్మజ కోరారు.
ఈ మేరకు ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రముఖ అగ్నివీర్ పథకంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ఇంటర్ లో ఇంగ్లిష్, ఫిజిక్స్, గణితంలో 50 శాతం మార్కులు, మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా, తత్సమాన విద్యార్హత ఉండాలన్నారు. అవివాహిత యువతీ, యువకులు అర్హులన్నారు.
ఎంపిక ప్రక్రియ మూడు అంచెల్లో ఉంటుందన్నారు. ఆన్లైన్ లో రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ ఫిట్నెస్ పరీక్షలతో పాటు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.agnipathvayyu.cdac.in వెబ్సైట్ లోఈ నెల 28వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.
No comments:
Post a Comment