రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. అప్లికేషన్ ప్రాసెస్ జులై 30న ప్రారంభం అవుతుంది.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్. ఇండియన్ రైల్వేస్ బీఈ, బీటెక్ అర్హతతో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. అప్లికేషన్ ప్రాసెస్ జులై 30న ప్రారంభం అవుతుంది. ఆగస్టు 29 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అర్హత ఉన్నవారు తమ పరిధిలోని రైల్వే జోన్ అధికారిక పోర్టల్ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గురించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం.
* ఖాళీల వివరాలు
జూనియర్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్‌వైజర్ (రీసెర్చ్), మెటలర్జికల్ సూపర్‌వైజర్ (రీసెర్చ్) వంటి పోస్టుల్లో మొత్తంగా 7951 ఖాళీలు భర్తీ కానున్నాయి.
* వయోపరిమితి
దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 36 ఏళ్లలోపు ఉండాలి.
* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
* అప్లికేషన్ ప్రాసెస్
- ముందుగా మీ పరిధి రైల్వే జోన్ ఆధారంగా RRB అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలోకి వెళ్లి ‘JE రిక్రూట్‌మెంట్’ లింక్ క్లిక్ చేసి, నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.
- ఆ తరువాత ‘అప్లైనౌ’ అనే ఆప్షన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ముందు పర్సనల్ వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
- రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి. దీంట్లో అన్ని వివరాలు నింపాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్ ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.
* అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ. 250 పేమెంట్ చేయాలి.
* సెలక్షన్ ప్రాసెస్
జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఉద్యోగులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు. ముందు సీబీటీ-1 ఎగ్జామ్, తర్వాత సీబీటీ-2 ఎగ్జామ్ ఉంటాయి. చివరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అభ్యర్థుల ఫైనల్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
* ఎగ్జామ్ ప్యాట్రన్
ఆర్‌ఆర్‌బీ సీబీటీ-1 ఎగ్జామ్ 100 మార్కులకు ఎంసీక్యూ మోడల్‌లో ఉంటుంది. మ్యాథమెటిక్స్ సెక్షన్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్- 25, జనరల్ అవేర్‌నెస్- 15, జనరల్ సైన్స్ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్క్ కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు .
సీబీటీ-2 ఎగ్జామ్‌లో 150 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ నుంచి 15 ప్రశ్నలు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ-15, కంప్యూటర్ అప్లికేషన్- 10, ఎన్విరాన్‌మెంట్ అండ్ పొల్యూషన్- 10, టెక్నికల్ ఎబిలిటీ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
* జీతాల వివరాలు
రైల్వేలో జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ. 35,400 లభిస్తుంది. జీతంతో పాటు అనేక రకాల అలవెన్సులు, సౌకర్యాలు అదనంగా లభిస్తాయి.
Qualification
ReplyDelete10th and inter and degree
ReplyDeletePlz reply message send me
ReplyDeleteWhen will expect the examination date
ReplyDelete