కేంద్ర బడ్జెట్‌లో నైపుణ్యాభివృద్ధి కోసం ‘వాలంటీర్ కోటా సిస్టమ్’ పేరుతో స్పెషల్ ప్రోగ్రామ్‌ను ప్రతిపాదించారు. ఈ ప్రోగ్రామ్ కింద 500 మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కల్పించడానికి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఇండియన్ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ ఈజ్‌మైట్రిప్ (EaseMyTrip) ముందుకు వచ్చింది.
యువతలో స్కిల్స్ పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో నైపుణ్యాభివృద్ధి కోసం ‘వాలంటీర్ కోటా సిస్టమ్’ పేరుతో స్పెషల్ ప్రోగ్రామ్‌ను ప్రతిపాదించింది. దీనిపై ఏకంగా రూ.2 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేయనుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా దేశంలోని టాప్ 500 కంపెనీల్లో కోటి మందికి పైగా యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించనున్నారు. ఈ ప్రోగ్రామ్ కింద 500 మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కల్పించడానికి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఇండియన్ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ ఈజ్‌మైట్రిప్ (EaseMyTrip) ముందుకు వచ్చింది.
కాన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిన్న న్యూఢిల్లీ వేదికగా ‘జర్నీ టువర్డ్స్ వికసిత్ భారత్: ఎ పోస్ట్ యూనియన్ బడ్జెట్ 2024-25’ పేరుతో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ప్రధాని మోదీ కాన్ఫరెన్స్ ప్రారంభ సెషన్‌లో పాల్గొన్నారు. ఆ తరువాత EaseMyTrip సీఈవో, కో-ఫౌండర్ నిషాంత్ పిట్టి ‘ఎక్స్’ వేదికగా కీలక ప్రకటన చేశారు.
500 కంటే ఎక్కువ ఇంటర్న్‌లు
“2025 బడ్జెట్‌లో ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన కొత్త ఉపాధి పథకం కింద, మా కంపెనీ దేశవ్యాప్తంగా 500+ ఇంటర్న్‌లను రిక్రూట్ చేసుకోనుంది. ఈ చొరవ ప్రభుత్వం ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ఆలోచనలకు మద్దతుగా నిలుస్తుంది. వికసిత్ భారత్ కోసం కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి మేం అభినందనలు తెలుపుతున్నాం.’’ అని నిషాంత్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ట్రావెల్ రంగంలో కొత్త బెంచ్‌మార్క్
తమ బృందంలో 500 కంటే ఎక్కువ ప్రతిభావంతులైన వ్యక్తులను చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు నిషాంత్ చెప్పారు. హ్యూమన్ క్యాపిటల్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మనదేశంలో ట్రావెలింగ్ ఇండస్ట్రీ కొత్త బెంచ్‌మార్క్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. యువతను సాధికారత, ఆవిష్కరణల వైపు నడిపిస్తే దేశాభివృద్ధికి కృషి చేస్తారని నిషాంత్ వివరించారు.
ఉపాధితో పాటు ఆవిష్కరణలకు ఊతం
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రకటించిన తర్వాత 500 మంది ఇంటర్న్‌ల నియామకాన్ని ప్రకటించిన మొదటి కంపెనీగా EaseMyTrip నిలిచింది. రోబోయే రోజుల్లో ఈ సంస్థ చేపట్టే భారీ నియామకాలు ఇండియన్ టూరిజం, ట్రావెలింగ్ ఇండస్ట్రీపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. యువ ప్రతిభను వెలికితీయడం ద్వారా బ్రాండ్ మార్కెట్‌లో ఉపాధిని సృష్టించవచ్చు. అదే సమయంలో సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతుంది.
EaseMyTrip సంస్థను 2008లో నిశాంత్ పిట్టి, రికాంత్ పిట్టి, ప్రశాంత్ పిట్టి స్థాపించారు. హోటల్ బుకింగ్స్, విమాన టిక్కెట్లు, దేశీయ, అంతర్జాతీయ హాలిడే ప్యాకేజీలు, బస్సు బుకింగ్స్, వైట్-లేబుల్ వంటి సేవలను ఈ సంస్థ అందిస్తోంది. సింగపూర్, UAE, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఆఫీస్‌లు ఉన్నాయి. ఆ దేశాల కోసం ప్రత్యేక వెబ్‌సైట్స్‌ను రన్ చేస్తోంది.
No comments:
Post a Comment