ఇలా వారికి నెలకు రూ. 5 వేలు స్టైఫండ్ కూడా చెల్లిస్తామని ప్రకటించింది. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 5 లక్షల లోపు ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. ఈరోజు నుంచి 19 వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అదిరిపోయే గుడ్ న్యూస్. నిరుద్యోగులకు కిర్రాక్ డీల్ అందుబాటులో ఉంది. నిరుద్యోగులకు ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. అయితే ఈ బెనిఫిట్ అందరికీ అందుబాటులో ఉండదు. కొందరికే ఈ ప్రయోజనం లభిస్తుంది.
గ్రూప్ 1 మెయిన్స్‌కు ఎంపిక అయిన బీసీ అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ వెల్లడించింది. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు.
ఖమ్మం, హైదరాబాద్‌లోని సెంటర్లలో 75 రోజుల పాటు కోచింగ్ కొనసాగుతుందని వెల్లడిచింది. ఇలా వారికి నెలకు రూ. 5 వేలు స్టైఫండ్ కూడా చెల్లిస్తామని ప్రకటించింది. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 5 లక్షల లోపు ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. ఈరోజు నుంచి 19 వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
https://tgbcstudycircle.cgg.gov.in/ వెబ్‌సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. స్టైఫండ్‌తో పాటుగా ఉచితంగానే శిక్షణ కూడా పొందొచ్చు. అందువల్ల జాబ్ కొట్టాలని భావించే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు
హైదరాబాద్ సైదాబాద్‌లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్ (రోడ్ నం: 8, లక్ష్మీనగర్), ఖమ్మంలోని టీజీ బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ ఇస్తారు. మరింత సమాచారం కోసం 040-24071188 నంబరులో సంప్రదించాలని సూచించారు.
ఇకపోతే తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. మెయిన్స్కు 1:50 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మొత్తంగా 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.
మరో వైపు ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి.
No comments:
Post a Comment