తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్ బడ్జెట్ పద్దును ప్రవేశపెట్టింది. ఈ వేదికగా జాబ్ క్యాలెండర్‌పై కీలక ప్రకటన చేశారు.
ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు.
ఈ సమావేశాల్లో తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. విద్యార్థులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ పై కీలక ప్రకటన చేశారు.
ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని, అతి త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి భారీ స్థాయిలో ఉద్యోగ కల్పన చేస్తామని పేర్కొన్నారు.
ఏ నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణ ఆకాంక్షకు బలమైన కారణమైందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. తాజాగా బడ్జెట్ సమావేశాల్లో భాగంగా త్వరలోనే జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.
అయితే ఈ జాబ్ క్యాలెండర్ మొత్తం 50 వేల పోస్టులతో ఉంటుందని తెలుస్తోంది. ఏటా మార్చి 31 లోగా అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను తెప్పించి జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇచ్చి.. డిసెంబర్ 9 లోపు నియామక పత్రాలను ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో పెట్టాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఇప్పటికే సీఎం రేవంత్ అన్నారు.
ఇకపోతే ఇప్పటికే డీఎస్సీ వేసి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. మరోసారి జనవరి నెలలో డీఎస్సీ వేయడానికి సిద్ధమవుతోంది. మొత్తం 6 వేల పోస్టులతో రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్ ఉండనుందట. ఇప్పటికే దీనిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు.
No comments:
Post a Comment