Mother Tongue

Read it Mother Tongue

Friday, 19 July 2024

Railway Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 2,424 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్

 నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్. రైల్వే శాఖలో భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్. రైల్వే శాఖలో భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తాజాగా సెంట్రల్ రైల్వే జోన్ అప్రెంటిస్‌షిష్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrccr.com విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఈ గడువు ఆగస్టు 15న ముగుస్తుంది. అప్రెంటీస్‌గా జాయిన్ అయిన వారు పని చేసే విధానం తెలుసుకోవచ్చు. అందుకు అవసరమైన స్కిల్స్ నేర్పిస్తారు. దీంతో భవిష్యత్తులో ఉద్యోగవకాశాలు మెరుగుపడతాయి. ఈ రిక్రూట్‌మెంట్ గురించి పూర్తి వివరాలు పరిశీలిద్దాం.

* ఖాళీల వివరాలు

సెంట్రల్ రైల్వే డివిజన్‌లో అప్రెంటిస్‌షిప్‌‌లో భాగంగా రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ 2,424 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది.

* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్

దరఖాస్తుదారులు కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఐటీఐలో సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ఒకేషనల్ ట్రైనింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ ఒకేషనల్ ట్రైనింగ్ కౌన్సిల్ జారీ చేసే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.

* వయోపరిమితి

అభ్యర్థుల వయసు కనీసం 15 ఏళ్ల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటాయి.

* అప్లికేషన్ ప్రాసెస్

- ముందుగా రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అధికారిక పోర్టల్ rrccr.com ఓపెన్ చేయాలి.

- హోమ్‌పేజీ‌‌లోకి వెళ్లి, ‘సెంట్రల్ రైల్వే అప్రెంటి‌స్‌షిప్-2024’ అనే లింక్ క్లిక్ చేసి, నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.

- తర్వాత ‘అప్లైనౌ’ ఆప్షన్ క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించాలి.

- ముందుగా వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. తర్వాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.

- అన్ని వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫారమ్ నింపాలి.

- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. చివరగా అప్లికేషన్ ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.

* సెలక్షన్ ప్రాసెస్

వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆ తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.

* అప్లికేషన్ ఫీజు

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఇక, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

* స్టైఫండ్

ఎంపికయ్యే అభ్యర్థులకు స్టైఫండ్ నెలకు రూ.7000 ఉంటుంది. అప్రెంటిస్‌గా ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ నిర్వహిస్తారు. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అప్రెంటిస్‌షిప్ యాక్ట్-1956 ప్రకారం ఈ రిక్రూట్‌మెంట్ చేపడుతోంది.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials