డీఎస్సీ విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రిక్రూట్‌మెంట్‌తో రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా డీఎస్సీ విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ బీసీ స్టడీ సర్కిల్స్‌లో అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె. శ్రీదేవి తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఉమ్మడి విశాఖ జిల్లా (ప్రస్తుత విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలు)కు చెందిన వెనుకబడిన తరగతులు (BC), షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలకు(ST) చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి AP BC స్టడీ సర్కిల్ డీఎస్సీ కోచింగ్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జులై 8లోపు అప్లికేషన్స్ సమర్పించాలి. మొత్తంగా 200 మంది అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచిత కోచింగ్‌తో పాటు నెలకు రూ.3,000 స్టైఫండ్, రూ.1,000 విలువైన స్టడీ మెటీరియల్స్ ఇవ్వనున్నారు.
మెగా డీఎస్సీ సిలబస్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి నారా లోకేశ్ ఖండించారు. సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. 2024 ఫిబ్రవరిలో ఏ సిలబస్‌తో టెట్ నిర్వహించారో అదే సిలబస్‌తో 2024 జులైలో టెట్ నిర్వహిస్తామని వెల్లడించారు.
Online Ela pettukovali
ReplyDeleteOnline lo Ela pettukovali
ReplyDelete