ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నారా? ఎక్కువ శాలరీ అందించే ఆప్షన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ వార్త.
ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నారా? ఎక్కువ శాలరీ అందించే ఆప్షన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ వార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (Steel Authority of India Limited)లో భారీ జీతంతో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 249 మేనేజ్మెంట్ ట్రైనీ (Management Trainee) పోస్టుల భర్తీ కోసం సెయిల్ ఇండియా నోటిఫికేషన్ ఇచ్చింది.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. జూలై 25 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు, యూనిట్లు, గనుల్లో పని చేయాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా చూస్తే.. కెమికల్ ఇంజినీరింగ్ - 10 పోస్టులు, సివిల్ ఇంజినీరింగ్ - 21 పోస్టులు, కంప్యూటర్ ఇంజినీరింగ్ - 9 పోస్టులు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - 61 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ - 5 పోస్టులు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ - 11 పోస్టులు, మెకానికల్ ఇంజినీరింగ్ - 69 పోస్టులు, మెటలర్జీ ఇంజినీరింగ్ - 63 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు గేట్-2024 స్కోర్ తప్పనిసరి.
వయోపరిమితి 28 ఏళ్లు మించి ఉండకూడదని నోటిఫికేషన్ లో తెలిపారు. ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. గేట్-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు జీతం ఉంటుంది. మరిన్ని వివరాలకు సెయిల్ అధికారిక వెబ్సైట్ https://www.sail.co.in/ విజిట్ చేయండి.
No comments:
Post a Comment