Mother Tongue

Read it Mother Tongue

Thursday, 25 July 2024

ఎల్‌ఐసీ‌లో భారీగా ఉద్యోగాలు.. సొంత రాష్ట్రంలో పోస్టింగ్..!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)లో కీలక విభాగం హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్..  జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఎల్‌ఐసీ అధికారిక పోర్టల్ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)లో కీలక విభాగం హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఎల్‌ఐసీ అధికారిక పోర్టల్ www.lichousing.com విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఈ గడువు ఆగస్టు 14న ముగుస్తుంది. నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం.

ఖాళీల వివరాలు

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో రాష్ట్రాల వారీగా ఖాళీలను ప్రకటించింది. మొత్తంగా 200 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను సంస్థ భర్తీ చేస్తుంది. అందులో ఏపీ నుంచి 12, తెలంగాణ నుంచి 31 పోస్టులు భర్తీ కానున్నాయి.

వయోపరిమితి

దరఖాస్తుదారుల వయసు కనీసం 21 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్లలోపు ఉండాలి.

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అందులో కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. కంప్యూటర్ ఆపరేటింగ్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి.

అప్లికేషన్ ప్రాసెస్

- ముందుగా ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ అధికారిక పోర్టల్ www.lichousing.com ఓపెన్ చేయాలి.

- హోమ్‌పేజీలోకి వెళ్లి, ‘కెరీర్’ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.

- అక్కడ ‘ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ జూనియర్ అసిస్టెంట్-2024’ అనే లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.

- ఆ తరువాత ‘అప్లైనౌ’ ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

- ముందు పర్సనల్ వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. తర్వాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.

- అన్ని వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫారమ్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

- అప్లికేషన్ ఫీజు చెల్లించి, చివరగా ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.

అప్లికేషన్ ఫీజు

అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.800+ 18శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆన్ లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. అదే ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్. రెండో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్ష సెప్టెంబర్‌లో జరుగుతుంది. రెండు దశలను క్లియర్ చేసినవారికి పోస్టింగ్ లభిస్తుంది.

ఎగ్జామ్ ప్యాట్రన్

ఆన్‌లైన్ ఎగ్జామ్ వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం మల్టిపుల్ ఛాయిస్ క్వశన్ మోడల్‌లో ఉంటుంది. పరీక్షలో మొత్తంగా ఐదు సెక్షన్స్ లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ స్కిల్ వంటివి ఉంటాయి. ఒక్కో సెక్షన్ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ఒక తప్పు సమాధానానికి 0.25 మార్క్ కట్ చేస్తారు.

జీతభత్యాలు

ఎల్‌ఐసీ జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు జీతం రూ.32,000 నుంచి 35,200 మధ్య లభిస్తుంది. ఇందులో అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు కలిసి ఉంటాయి.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials