బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు, బ్యాకింగ్ సెక్టార్‌లో సెటిల్ అవ్వాలనుకునే వారికి గుడ్‌న్యూస్. బ్యాంకింగ్ సర్వీసెస్‌పై అవగాహన పెంచుకునేందుకు ఇండియన్ బ్యాంక్ అవకాశాలు కల్పిస్తోంది. తాజాగా ఈ బ్యాంక్ అర్హులైన అభ్యర్థుల నుంచి అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్లికేషన్ ప్రాసెస్ జులై 10న ప్రారంభం కాగా, జులై 31న గడువు ముగుస్తుంది.
అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ indianbank.in విజిట్ చేసి అప్లై చేసుకోవాలి. అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భర్తీ కానున్న పోస్టులు, అప్లికేషన్, సెలక్షన్ ప్రాసెస్ తదితర వివరాలు పరిశీలిద్దాం.
* ఖాళీల వివరాలు
ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 1500 ఖాళీలను భర్తీ చేస్తుంది.
* వయోపరిమితి
దరఖాస్తుదారుల వయసు 2024 జులై 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. లేదా అందుకు సమానమైన కోర్సు చేసి ఉండాలి. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించి ఉండాలి. అయితే 2020 మార్చి 31 లోపు గ్రాడ్యుయేషన్ తప్పనిసరిగా పూర్తిచేసి ఉండాలి.
* అప్లికేషన్ ప్రాసెస్
- ముందుగా ఇండియన్ బ్యాంక్ అధికారిక పోర్టల్ indianbank.in విజిట్ చేయాలి.
- హోమ్‌పేజీలోకి వెళ్లి, ‘కెరీర్’ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ‘ఇండియన్ బ్యాంక్ అప్రెంటీస్2024-25’ అనే లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.
- తర్వాత ‘అప్లైనౌ’ ఆప్షన్ క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించాలి. ముందుగా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
- అనంతరం రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి. ఇక్కడ అన్ని వివరాలు నింపాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్ ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.
*అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
*ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ముందు ఆన్‌లైన్ ఎగ్జామ్, రెండో దశలో లోకల్ లాంగ్వేజ్‌పై స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ తరువాత మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అన్ని దశలను క్లియర్ చేసిన వారిని మాత్రమే ఎంపిక చేస్తారు.
*ఎగ్జామ్ ప్యాట్రన్
ఆన్‌లైన్ రాత పరీక్ష 100 మార్కులకు ఎంసీక్యూ మోడల్‌లో ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఆప్టిట్యూడ్ & కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్ అనే నాలుగు సెక్షన్స్ నుంచి 25 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంగ్లిష్ మినహా మిగతా సెక్షన్స్ ప్రశ్నాపత్రాలు రీజనల్ లాంగ్వేజ్‌లో ఉంటాయి. పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్‌కు 1/4 మార్క్ కట్ అవుతుంది. ఎగ్జామ్ వ్యవధి 60 నిమిషాలు. ప్రతి కరెక్ట్ సమాధానానికి ఒక మార్కు ఇస్తారు.
*స్టైఫండ్
ఎంపికయ్యే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ ల్లో ఏడాది పాటు ట్రైనింగ్ ఉంటుంది. అర్బన్/మెట్రో నగరాల్లోని బ్రాంచ్‌ల్లో ట్రైనింగ్ పొందే అభ్యర్థులకు స్టైఫండ్ నెలకు రూ. 15,000 కాగా, సెమీ అర్బన్, రూరల్ బ్రాంచ్‌ల్లో ట్రైనింగ్ పొందే అభ్యర్థులకు రూ.12,000 లభిస్తుంది.
No comments:
Post a Comment