Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 30 May 2023

కేంద్ర ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు..ఎంపికైతే నెలకు రూ.2లక్షలకు పైగా జీతం..

Govt Jobs: నిరుద్యోగులకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్థిక సలహాదారు (Financial Advisor) పొజిషన్‌ను భర్తీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ప్రస్తుతానికి ఒకే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ పోస్ట్‌ను మంత్రిత్వ శాఖ భర్తీ చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులు లెవెల్-13 పే స్కేల్‌లో మంత్లీ శాలరీ అందుకుంటారు. ఈ జీతం రూ.1,23,100 నుంచి రూ.2,15,900 వరకు ఉంటుంది. ఫైనాన్షియల్ అడ్వైజర్ పోస్టుకు అర్హత, సెలక్షన్ ప్రాసెస్, ఇతర వివరాలు చూద్దాం. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారి వయసు 56 ఏళ్లలోపు ఉండాలి. అభ్యర్థులు లెవెల్-12 ఆర్గనైజ్డ్ అకౌంట్స్ సర్వీసులలో ఐదు సంవత్సరాలు జనరల్ డ్యూటీ చేసి ఉండాలి. లేదా లెవెల్-12లో కేంద్ర ప్రభుత్వంలో డిప్యూటీ సెక్రటరీగా ఐదేళ్ల స్టాండర్డ్ సర్వీసు అందించి ఉండాలి. రిక్రూట్‌మెంట్ 2023 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఎంపికైన వారి పదవీకాలం పూర్తిగా మూడేళ్ల కాలానికి డిప్యుటేషన్ ఆధారంగా ఉంటుంది. ఆర్థిక సలహాదారు పోస్ట్‌కు దరఖాస్తు చేయడానికి, మంత్రిత్వ శాఖ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయాలి. దాన్ని ఫిల్ చేసి.. అవసరమైన డాక్యుమెంట్స్‌తో కలిపి.. పేర్కొన్న చిరునామాకు సరైన ఛానెల్ ద్వారా పంపాలి. ఎన్వలప్‌పై "అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ అడ్వైసర్ ఎట్ న్యూ ఐయిమ్స్" అని లేబుల్ చేయాలి. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన 45 రోజులలోపు దరఖాస్తును సమర్పించాలి. ఫైనాన్షియల్ అడ్వైజర్ పోస్టుకు అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా సెలక్ట్ చేస్తారు. అప్లికేషన్ల పరిశీలన తర్వాత, అర్హులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థులు అందించిన సమాచారానికి రుజువుగా ఇంటర్వ్యూ సమయంలో ఒరిజినల్ డాక్యుమెంట్లను తప్పనిసరిగా అందించాలి. ఇది రెగ్యులర్ పోస్టు. ఎంపికైన అభ్యర్థుల పోస్టింగ్ లొకేషన్‌ను మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారతదేశంలో ఆరోగ్య సంబంధిత విధానాలు, కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటుంది. అలానే మంత్రిత్వ శాఖలోని వివిధ ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లను ప్రకటిస్తుంది. గతంలో మంత్రిత్వ శాఖ మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, ఇతర ఆరోగ్య సంరక్షణ సంబంధిత పోస్ట్‌లలో అభ్యర్థులను నియమించింది. తాజాగా ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉద్యోగానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ గురించి మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ రిఫర్ చేయడం మంచిది.

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

2 comments:

  1. Good morning sir nursing post ki link leda sir

    ReplyDelete

Job Alerts and Study Materials