సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 9 వేలకు పైగా కానిస్టేబుళ్ల (టెక్నికల్ మరియు ట్రేడ్) ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.crpf.gov.inని సందర్శించడం ద్వారా రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27 నుండి ప్రారంభమై ఏప్రిల్ 24ను చివరి తేదీగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీనిని మే 02వ తేదీ వరకు పొడిగించారు. అంటే రేపటితో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక కోసం 2023 జూలై 1 నుండి 13 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను జూన్ 20న విడుదల చేస్తారు. రాత పరీక్షతో పాటు, నియామక ప్రక్రియలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటాయి.
ఉద్యోగ ఖాళీలు 9,212
- పురుషులకు 9,105
- మహిళా అభ్యర్థులకు 107 పోస్టులు
ముఖ్యమైన తేదీలు
- మార్చ్ 27, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- మే 02, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
- అడ్మిట్ కార్డ్ ను జూన్ 20 నుండి 25 మధ్యలో జారీచేయనున్నారు
- CRPF కానిస్టేబుల్ పరీక్ష జులై 1 నుంచి 13 వరకు ఉంటాయి
దరఖాస్తు రుసుము
- జనరల్, EWS మరియు OBC కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించబడింది
- SC/ST అభ్యర్థులు, మహిళలు (అన్ని కేటగిరీలు) అభ్యర్థులు మరియు మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంది
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment