సర్వేయర్, ప్లంబింగ్ కోర్సులలో ఉచిత శిక్షణ.. ఆసక్తి కలిగిన వారు తమ పూర్తి బయోడేటాతో పాటు ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలు జిరాక్స్ కాపీలు 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకుని నేరుగా పట్టణంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులకు గుడ్ న్యూస్. 10వ తరగతి పాస్ అయితే చాలు. ప్లంబర్, మరియు సర్వేయర్ కోర్సులలో ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు . ఈ నెల 15వ తేదీ లాస్ట్ పూర్తి వివరాలు ఇవే.
ప్రస్తుతం దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం రియల్ఎస్టేట్ వ్యాపారస్థులు పెట్టుబడులు పెడుతుండటంతో సర్వేయర్ల కొరత బాగా ఏర్పడుతుంది. ఒక ప్రదేశంలో ఏదైనా బిల్డింగ్ కట్టాలన్న లేదా ఏదైనా ఇళ్లు కట్టాలన్న అక్కడ భూమి ఎలా ఉంది. వాటి హద్దులు ఎలా ఉన్నాయి. ఇలాంటి వాటిని సర్వేయర్లు క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఒక నివేదిక రూపంలో అందిస్తారు. అలా చేసినా వారికి గుర్తింపు పొందిన సంస్థల ద్వారా వచ్చే జీతాలు కూడా భారీగానే ఉంటాయి.
ఇలాంటి తరుణంలో విద్యార్థులకు సర్వే చేయడంలో ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు న్యాక్ సంస్థ ముందుకొచ్చిందని నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన న్యాక్ కేంద్రం ఇంచార్జ్ తిమోతి తెలిపారు.
అసిస్టెంట్ సర్వేయర్ శిక్షణతో పాటు ప్లంబింగ్ వర్క్ లో కూడా ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఈ రెండింటికి డిమాండ్ బాగా పెరిగిందని వీటి వల్ల గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నందునా ఈ రెండిటికీ సంబంధించిన వాటిలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు తమ పూర్తి బయోడేటాతో పాటు ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలు జిరాక్స్ కాపీలు 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకుని నేరుగా డోన్ పట్టణంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 76618 28641-83286 46601 అనే నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు.
7207819099
ReplyDeleteB anjaneyulu
ReplyDeleteసార్ ఈ సంస్థ వైజాగ్ లో ఉంటే తెలియజేయగలరు. TQ SIR🙏
ReplyDelete