అన్నమయ్య జిల్లా, మదనపల్లి పట్టణంలోని విద్యార్థులు, విద్యార్థినీల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేందుకు, వారిలో దాగి ఉన్నసృజనాత్మక ఆలోచనలను ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
అన్నమయ్య జిల్లా, మదనపల్లి పట్టణంలోని విద్యార్థులు, విద్యార్థినీల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేందుకు, వారిలో దాగి ఉన్నసృజనాత్మక ఆలోచనలను ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
విద్యార్థులు పరిశోధన, ప్రయోగాల్లో రాణించేలా ఏటా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పేరుతో జాతీయ స్థాయిలో ప్రతిభాన్వేషణ్ పరీక్ష నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సమాచార సంస్థ ఆధ్వర్యంలో ఎన్సీఈఆర్టీ, విజ్ఞాన్ ప్రసాద్, విజ్ఞాన భారతి సంయుక్తంగా వీవీఎం పేరిట ఏటా ప్రతిభాన్వేషణ పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
ప్రస్తుతం 2024-25 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరు నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ చదువు తున్న విద్యార్థులకు స్టేట్ బోర్డు, సీబీఎస్ఈ, ఎన్సీ ఈఆర్టీ వారికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.
ఇందులో ప్రతిభ కనబరిచినవారు భారతదేశ ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షను జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహిస్తారు. 6-8 తరగతులకు జూనియర్ 9-11 తరగతులకు సీనియర్ గ్రూపుగా పరీక్ష ఉంటుంది. ఇందులో తెలుగు, హిందీ, ఇంగ్లీషు తదితరభాషల్లో పరీక్ష ఉంటుంది. విద్యార్థుల ఆసక్తిని బట్టి వారికి నచ్చిన భాషల్లో పరీక్ష రాయవచ్చు.
రాష్ట్ర స్థాయి పరీక్ష నవంబర్ 26 లేదా డిసెంబర్ 3,10,17 తేదీల్లో ఏదో ఒక రోజు రాయాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ప్రతి తరగతి నుంచి ప్రథమ, ద్వితీ య, తృతీయ బహుమతులు వరుసగా రూ.5 వేలు, రూ.3 వేలు, 2 వేలతో పాటు మెమెంటో, సర్టిఫికెట్ అందజేస్తారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి మెమెంటో, ప్రశంసాపత్రం అందజేస్తారు.
జాతీయ స్థాయి విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా వరుసగా రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలతో పాటు మెమెంటో, ప్రశంసాపత్రం అందజేస్తారు. విద్యార్థి విజ్ఞాన్ మంథన్ 2023-224 జాతీయ, జోనల్ స్థాయి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అందజేస్తారు.
Link send me
ReplyDelete