కేంద్ర ప్రభుత్వం యూత్ కోసం రకరకాల పథకాలు తెచ్చింది. ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. యువత స్కిల్ డెవలప్ చేస్తోంది. చదువుల కోసం స్కాలర్షిప్లు కూడా ఇస్తోంది. వాటి కోవలోకే వచ్చే ఇదో ప్రత్యేకమైన పథకం. దీని ద్వారా 10వ తరగతి పాసైనా చాలు, ఇంట్లోనే ఉంటూ నెలకు రూ.8,000 చొప్పున పొందవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
PM Kaushal Vikas scheme:
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన భారతీయ యువతకు
ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఇది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను
మెరుగుపరచడానికి ఒక మాధ్యమాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా దేశంలోని
నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ అందించనున్నారు. తద్వారా వారి
నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. వారిని శ్రేయస్సు వైపు నడిపించవచ్చు.
ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా కేంద్రం పెద్ద సంఖ్యలో నిరుద్యోగ
యువతకు ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది, తద్వారా వారికి ఉపాధి మార్గం సులభతరం
అవుతుంది. మరి నెలకు రూ.8,000 చొప్పున ఎలా పొందాలో తెలుసుకుందాం.
భారతీయుల కోసమే ఈ పథకం:
మీరు భారతదేశ పౌరులైతే PM స్కిల్ డెవలప్మెంట్
స్కీమ్ కింద దరఖాస్తు చేయడం ద్వారా మీ భవిష్యత్తును ఉజ్వలంగా
మార్చుకోవాలనుకుంటే, మీరు ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చు. నిరుద్యోగ యువత
కోసమే ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీన్ని స్కిల్
డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఈ
పథకం ద్వారా దాదాపు 40 విభాగాల్లో శిక్షణ (ట్రైనింగ్) ఇస్తున్నారు.
తద్వారా లక్షల మంది యువత, ఇంట్లోనే ఉంటూ, ఆన్లైన్లో శిక్షణ
తీసుకుంటున్నారు. ఇందుకోసం వారు స్కిల్ ఇండియా డిజిటల్ పై ప్రాక్టికల్
కోర్సు చేస్తారు. ఈ కోర్స్ చేసిన సమయంలో ప్రతి యువకుడికీ నెలకు రూ.8 వేలు
చొప్పున ఇస్తారు.
కోర్స్ పూర్తైతే సర్టిఫికెట్:
ఈ పథకం ద్వారా ఏదైనా స్కిల్ డెవలప్మెంట్
కోర్సు చేసిన వారికి, కోర్సు పూర్తైన తర్వాత కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్
కూడా ఇస్తుంది. ఇలా రకరకాల కోర్సులు చెయ్యవచ్చు. తద్వారా లబ్దిదారుడు.. ఇతర
నిరుద్యోగుల కంటే వేగంగా ఉద్యోగం పొందేందుకు వీలవుతుంది. ఈ సర్టిఫికెట్
భారతదేశంలో అన్నిచోట్లా చెల్లుబాటు అవుతుంది, తద్వారా యువతకు ఏ
రాష్ట్రంలోనైనా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు ఈ పథకం కింద
లబ్దిదారుడికి టీషర్ట్ లేదా జాకెట్, డైరీ, ఐడీ కార్డు, బ్యాగ్ మొదలైన
వాటిని కూడా ఇస్తారు. ఇందుకోసం నిరుద్యోగ యువత ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్
ప్రక్రియ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్
సైట్ (https://www.pmkvyofficial.org/home-page) ఉంది.
ఈ పథకం కోసం ఉండాల్సిన అర్హతలు:
దరఖాస్తుదారుడు భారత పౌరుడై ఉండాలి.
దేశంలోని నిరుద్యోగ యువత ఈ పథకానికి అర్హులు. దరఖాస్తుదారుడు 18 ఏళ్లకు
పైబడి ఉండాలి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారుడి కనీస
విద్యార్హతగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. దరఖాస్తుదారుడికి హిందీ,
ఇంగ్లీష్ ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. అంటే కొంతైనా అవగాహన ఉండాలి. తద్వారా
కోర్సును త్వరగా, తేలికగా, సమర్థంగా చేసేందుకు వీలవుతుంది.
ఈ పథకం కోసం ఉండాల్సిన పత్రాలు:
ఆధార్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డు,
విద్యార్హత పత్రాలు, నివాస ధృవీకరణ పత్రం, మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజు
ఫొటో, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కలిగివుండాలి.
ఈ పథకం పొందేందుకు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?:
ముందుగా అధికారిక వెబ్సైట్ (https://www.pmkvyofficial.org/home-page)కి
వెళ్లాలి. హోమ్ పేజీలో PMKVY ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్పై క్లిక్
చెయ్యాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ ఫారం మీ ముందు ఓపెన్ అవుతుంది. అందులో
కోరిన సమాచారాన్ని ఇవ్వాలి. తర్వాత అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.
చివరగా సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా, మీరు ప్రధానమంత్రి
నైపుణ్య అభివృద్ధి పథకం కింద ఆన్లైన్లో సులభంగా నమోదు చేసుకోవచ్చు.
అధికారికంగా పూర్తి వివరాలు ఇక్కడ పొందండి:
ఈ పథకానికి సంబంధించిన అధికారిక సమాచారం ఇక్కడ ( https://www.pmkvyofficial.org/pmkvy2/App_Documents/News/PMKVY_Scheme-Document_v1.1.pdf) PDF ఫార్మాట్లో మీరు పొందవచ్చు. నెలకు రూ.8,000 ఇస్తున్న సమాచారం కూడా ఇందులో మీరు చూడవచ్చు.
Last date june month
ReplyDeleteNot open the website
DeleteHello select me
DeleteLaste date june 30th register
ReplyDeleteYes intrested in job
ReplyDeleteYes intrested in job
ReplyDeleteYes intrested in job
ReplyDeleteఇది ఎలా జాబ్ ఎలా
ReplyDeleteకాన్టీకాంట్ నబార్ సెండ్
ReplyDeleteLast date yeppudu
ReplyDeleteSBI
ReplyDeleteSanthosh
ReplyDeleteDear Students Available
ReplyDeleteOk
Delete40 abow vallu & ledies kuda e trainig thisukovacha
ReplyDeletedheeraj
ReplyDeletedheerajrider
ReplyDeleteApplication
ReplyDelete