Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 2 July 2024

గుడ్ న్యూస్.. అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

 చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అర్హత, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ నాగశైలజ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పలు కేడర్ల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అర్హత, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ నాగశైలజ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పలు కేడర్ల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 11, మినీ కార్యకర్త-18, హెల్పర్-58 మొత్తం 87 పోస్టులు ఉన్నాయని వెల్లడించారు. సంబంధిత పోస్టుల ఖాళీల వివరాలను జిల్లాలోని అన్ని సీడీపీఓ కార్యాలయాలకు పంపినట్లు చెప్పారు. అంగన్వాడీ కేంద్రం, గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని పదోతరగతి పూర్తి చేసిన వివాహిత మహిళలు ఈ నెల 4 నుంచి 19 వ తేదీలోపు సీడీపీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు సీడీపీఓ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు. 

అర్హతలు: అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త , అంగన్వాడీ సహాయకుల పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలి. అభ్యర్థులు వివాహితులు అయి స్థానికులు అయి ఉండాలి.

అంగన్వాడీ కేంద్రము ఉన్న గ్రామములో స్థానికులు అయి ఉండాలి. 01.07.2024 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయస్సు 21 సం.లు. నుండి 35 సం.లు లోపల వారు అయి ఉండాలి.

అంగన్వాడీ సహాయకురాలు ఎవరైనా అంగన్వాడీ కార్యకర్తకు దరఖాస్తు చేసుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 21 ఏళ్లు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు. అంగన్వాడీ కార్య కర్త /అంగన్వాడీ సహాయకురాలు పోస్ట్ కొరకు యస్.సి, యస్.టి. అభ్యర్థులు మాత్రమే అర్హులున్నారు.

అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడి కార్యకర్త ,అంగన్వాడీ సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్ధులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గౌరవ వేతనం చెల్లిస్తారు.

ప్రస్తుతం జూలై 2019 నుండి అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం: రూ.11500/- నెలకు, మినీ అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం: రూ.7000/- నెలకు అంగన్వాడీ హెల్పెర్ గౌరవ వేతనం: రూ.7000 గా ఉంది.




1 comment:

Job Alerts and Study Materials