నిరుద్యోగులకు శుభవార్త చెప్పడానికి రెడీ అయ్యారు సీఎం రేవంత్. నిరుద్యోగుల్లో ఎలాంటి ఆందోళన ఉండొద్దని భావించిన ఆయన.. జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.
పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్రంలోని నిరుద్యోగంపై ఫోకస్ పెట్టిన రేవంత్.. అందుకు తగ్గట్లుగా ఉద్యోగాల ప్రకటనకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పట్ల నిరుద్యోగుల్లో ఉన్న అయోమయాన్ని తొలగించేలా జాబ్ క్యాలెండర్ సిద్ధం చేస్తున్నారు సీఎం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే జాబ్ క్యాలెండర్ సిద్ధం చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారట. ప్రస్తుతం దీనిపై కసరత్తులు జరుగుతున్నట్లు సమాచారం. ఉద్యోగాల భర్తీ మరింత పారదర్శకంగా ఉండాలని, ఎగ్జామ్ డేట్స్ విషయంలో నిరుద్యోగుల్లో ఎలాంటి ఆందోళన ఉండొద్దని భావించిన తెలంగాణ సర్కార్.. జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు రెడీ అయిందట. మరో రెండు వారాల్లో అన్ని ఉద్యోగాలతో కూడిన సమాచారం పొందుపరుస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేసిందట. గత ప్రభుత్వం చేసిన లోపాలను సరిదిద్దుతూ సర్కారీ కొలువులను పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నారట అధికారులు. నిరుద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే అధికారులు ప్రాథమిక నివేదికను అందజేయగా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అధికారులు జాబ్ క్యాలెండర్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారని, మరో రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ అధికారికంగా విడుదల చేయబోతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ), తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, ఇతర నియామక బోర్డులకు సంబంధించిన పరీక్ష షెడ్యూళ్లతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. యూపీఎస్సీ నమూనా, ఆయన పరీక్షల షెడ్యూల్‌లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర జాబ్ క్యాలెండర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే గ్రూప్-1 మెయిన్స్ తేదీలను, గ్రూప్-2 పరీక్షలను ఆగస్టులో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న నోటిఫికేషన్లను మినహాయించి జాబ్ క్యాలెండర్ రెడీ చేసినట్లు తెలిసింది.
Hi sir
ReplyDelete