Mother Tongue

Read it Mother Tongue

Thursday, 11 July 2024

రాత పరీక్ష లేకుండానే FSSAI లో ఉద్యోగాలు.. నెలకు రూ. 1 లక్ష పైనే వరకు జీతం

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)లో గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బీ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రారంభమైంది.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)లో గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బీ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రారంభమైంది. మొత్తం 11 పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్ మెంట్ జరుగుతుండగా..ఇందులో  అసిస్టెంట్ డైరెక్టర్ 5, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 6 పోస్టులు ఉన్నాయి. 45 ఏళ్లు పైబడిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ fssai.gov.in లో వివరాలను చెక్ చేయవచ్చు.  దరఖాస్తు చేసుకోవడానికి జూలై 29 చివరి తేదీ.

విద్యార్హత

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. దీంతోపాటు అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ విభాగాల్లో 6 ఏళ్లపాటు పనిచేసిన అనుభవం కూడా ఉండాలి. అదేవిధంగా,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ కోసం అభ్యర్థి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే మూడేళ్ల పని అనుభవం కూడా అవసరం.

వయోపరిమితి

అసిస్టెంట్ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రెండు పోస్టులకు అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

జీతం

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు ఎంపికైన వ్యక్తికి పే లెవెల్-10 కింద నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతం లభిస్తుంది.  అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు లెవెల్-8 కింద నెలకు రూ. 51,100 వరకు జీతం లభిస్తుంది.

అప్లయ్ చేయడం ఎలా

ఈ పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్‌తో పాటు ఆఫ్‌లైన్ అప్లికేషన్ కూడా చేయవచ్చు. ఆఫ్‌లైన్ దరఖాస్తును…అసిస్టెంట్ డైరెక్టర్, FSSI ప్రధాన కార్యాలయం,మూడవ అంతస్తు, FDA భవన్,కోట్లా రోడ్, న్యూ ఢిల్లీ అడ్రస్ కి పంపించాల్సి ఉంటుంది.



4 comments:

Job Alerts and Study Materials