మన దేశంలో ఉద్యోగాలు చేసేవారు కోటీశ్వరులు అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే జీతాలు పెద్దగా ఉండవు. మల్టీనేషనల్ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలు చేసే వారు తప్ప మిగతా వారందరూ తక్కువ శాలరీలకే పరిమితమవుతున్నారు. కానీ ఒక జాబ్ చేస్తే మాత్రం, ఒక్క ఏడాదిలోనే కరోడ్‌పతి కావచ్చు. ఈ ఉద్యోగం చేసే వారికి భారీ జీతం ఇస్తారు. శాలరీ అంత ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి రోజంతా పనిచేయాలేమో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ ఉద్యోగంలో చేరిన వారు రోజులో కొన్ని నిమిషాలు పని చేస్తే చాలు. అలానే ఎవరి ఆదేశాలనూ పాటించనక్కర్లేదు. ఈ జాబ్ చేసేవారు ఏడాదికి ఏకంగా రూ.30కోట్లు సంపాదించవచ్చు. ఈ డ్రీమ్ జాబ్ ఏంటో చూడండి.
ఈ ఉద్యోగం చేసేవారు ఎప్పుడూ ఒంటరిగానే ఉండాలి. ఇంతకీ ఈ ఉద్యోగం ఏంటంటే, ఓ లైట్‌హౌస్‌లో కీపర్ జాబ్. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా ఓడరేవులో ఉందా లైట్‌హౌస్. దీన్ని ఫారోస్ లైట్‌హౌస్ (Pharos Lighthouse) అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే మొదటి లైట్‌హౌస్, గ్రేటెస్ట్ ఇంజనీరింగ్ అచీవ్‌మెంట్‌గా పేరుగాంచింది. మరి ఇందులో కీపర్ ఉద్యోగం చేస్తే అంత శాలరీ ఎందుకు ఇస్తారో, చేయాల్సిన పని ఏంటో తెలుసుకుందాం.
* ఎప్పుడూ లైట్ ఆన్ చేసి ఉండాలి
లైట్‌హౌస్ కీపర్ చేయాల్సిన ఏకైక పని ఏంటంటే ఆ వ్యక్తి లైట్ ఎప్పుడూ వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. డే టైమ్ లేదా నైట్ టైమ్ అనే తేడా లేకుండా లైట్ హౌస్‌లో లైట్ వెలుగుతూ ఉండేలా చూసుకోవడమే వాళ్ల పని. మిగతా సమయంలో నిద్రపోవచ్చు, తినవచ్చు లేదా సముద్రపు అందాలను చూడవచ్చు. ఈ పనికి ఏడాదికి రూ.30 కోట్లు ఇస్తారు. అయినా కూడా చాలామంది ఈ ఉద్యోగం చేయడానికి ఇష్టపడటం లేదు.
* ప్రాణాలకే ప్రమాదం
ఈ జాబ్ ప్రపంచంలోనే అత్యంత కష్టమైన ఉద్యోగాల్లో ఒకటిగా భావిస్తారు. ఎందుకంటే, లైట్‌హౌస్ కీపర్ ఎప్పుడూ ఒంటరిగా ఉండాలి. సముద్రం మధ్యలో ఉండాల్సి ఉంటుంది. వారితో మాట్లాడేవాళ్లు ఎవరూ ఉండరు, స్నేహితులు కూడా ఉండరు. కొన్నిసార్లు సముద్రపు తుఫానులు (Sea storms) చాలా బలంగా వీస్తాయి. దీంతో లైట్‌హౌస్ మొత్తం నీళ్లలో మునిగిపోతుంది. అప్పుడు ఆ కీపర్ జీవితం కూడా ప్రమాదంలో పడుతుంది.
* లైట్‌హౌస్ ఎందుకు ఇంపార్టెంట్ ?
ఇంతకుముందు కాలంలో సముద్రంలో చాలా రాళ్ళు ఉండేవి. రాత్రి సమయంలో ఆ రాళ్లు కనిపించక ఓడలు వాటిని గమనించకుండా ఢీకొనేవి. దీంతో చాలా ఓడలు మునిగిపోయేవి. ఈ సమస్యను పరిష్కరించడానికి లైట్‌హౌస్‌లు కట్టడం ప్రారంభించారు. లైట్‌హౌస్‌లు నీటిలో ఉన్న పెద్ద పెద్ద రాళ్లు, లోతులేని నీటి ప్రాంతాలను హైలెట్ చేసి చూపించేవి. లైట్‌హౌస్‌లోని వెలిగించే లైట్ వెలుగు చాలా దూరం వరకు కనిపించేది. అందువల్ల ఓడలు ఎక్కడ ప్రమాదాలు ఉన్నాయో తెలుసుకుని చాలా సురక్షితంగా ప్రయాణించేవి.
అయితే ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినా సరే, లైట్ హౌస్‌లను అలాగే అందుబాటులో ఉంచారు. GPS సిగ్నల్ లాస్ అయినప్పుడు, లేదంటే బ్యాకప్ నావిగేషన్ సిస్టమ్‌లాగా వీటిని ఇప్పటికీ నడిపిస్తున్నారు. మోడ్రన్ నావిగేషన్ సిస్టమ్స్‌తో పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు కూడా తక్కువే.
ఫారోస్ లైట్‌హౌస్‌ను నిర్మించడానికి చాలా ఏళ్ల సమయం పట్టింది. దీని నిర్మాణానికి చెక్క, రాళ్లు, ఇనుము వంటివి వాడారు. లైట్‌హౌస్ లోపల పెద్ద మంట వెలిగించేవారు. ఆ మంట వెలుగును లెన్స్‌ల సహాయంతో చాలా దూరం వరకు స్ప్రెడ్ అయ్యేలా చేసేవారు.
I want to intrest in light house job, I don't know how to apply please
ReplyDeletecontact me 8523087223