స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్-2023ను (SSC CGL 2023 Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లోని దాదాపు 7500 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ అఫీసర్ తో పాటు మొత్తం 36 కేటగిరీల్లోని ఖాళీలు ఇందులో ఉన్నాయి.
ఉద్యోగ ఖాళీలు 7500
- మొత్తం 36 కేటగిరీల్లోని ఖాళీలు ఇందులో ఉన్నాయి
ముఖ్యమైన తేదీలు
- మే 03, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు (ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు రాత్రి 11 గంటలలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది)
- అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ లో చెల్లించడానికి ఆఖరి తేదీ: మే 4 (23:00)
- ఆఫ్ లైన్ చలానా జనరేట్ చేయడానికి లాస్ట్ డేట్: మే 4 (23:00)
- అప్లికేషన్ ఫామ్ కరెక్షన్: మే 7 నుంచి 8వ తేదీ వరకు
- టైర్-1 పరీక్ష: జులై 2023
దరఖాస్తు రుసుము
- అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది
- ఎస్సీ, ఎస్టీ, PwBD, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళలకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
విద్యార్హత
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో రిజిస్టేషన్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment