ఎంపిక అయిన వారికి ప్రతి నెలా స్టైఫండ్ ఇస్తారు. అలాగే అకామిడేషన్ కూడా ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి.
గుడ్ న్యూస్. బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. అలాగే ఉచితంగా ఫుడ్, స్టేయింగ్ కూడా లభిస్తుంది. ఎలా అని ఆలోచిస్తున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. గవర్నెన్స్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఒకటి ప్రారంభం అవుతోంది. మీరు కూడా ఇందులో పాల్గొంటే మాత్రం ప్రతి నెలా స్టైఫండ్ వస్తుంది. అలాగే ఉండటానికి అకామోడేషన్ కూడా కల్పిస్తారు. అందువల్ల యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం ఉత్తమం. అసలు ఇంతకీ ఇది ఏ ఇంటర్న్‌షిప్? ఎవరు తీసుకువస్తున్నారు? ఎవరికి ఈ బెనిఫిట్ లభిస్తుంది? ఎవరు అప్లై చేసుకోవచ్చు? వంటి అంశాలు ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. టీడీపీ ఎంపీ రామ్ మోహన్ నాయుడు ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. పాలిటిక్స్4ఇంపాక్ట్ కింద గవర్నెన్స్ ఇంటర్న్ షిప్ ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. వ్యవసాయం, పర్యాటకం, పట్టణ, పాలన వంటి రంగాలలో మార్పును తీసుకురావడానికి యువతకు ఈ కార్యక్రమం శక్తిని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు మాట్లాడే వారికే ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. http://bit.ly/PFISKLM లింక్ ద్వారా మీరు నేరుగా ఈ ప్రోగ్రామ్ కోసం అప్లై చేసుకోవచ్చు. శ్రీకాకుళంలో ఈ ఫెల్లోషిప్ 6 నెలలు ఉంటుంది. శ్రీకాకుళం పార్లమెంటరీ కాన్‌స్టిట్యూయెన్సీలో పాలనకు సంబంధించిన అంశాల్లో కొత్త ఆవిష్కరణలు తీసుకురావడం, సమస్యలకు పరిష్కారంతో కూడిన నిర్ణయాలు వెతకడం వంటివి లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళంలో ఎంపీ ఆఫీస్‌తో ఈ ఇంటర్న్స్ కలిసి పని చేయాల్సి ఉంటుంది. స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారం దిశగా సూచనలు, సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్ కోసం చేరిన వారు అగ్రికల్చర్, పశుసంవర్ధకం, అర్బన్ గవర్నెన్స్, స్పోర్ట్స్, టూరిజం, జాబ్ క్రియేషన్, రూరల్ డెవలప్‌మెంట్ వంటి విభాగాల్లో వారి కంట్రిబూషన్ ఇవ్వొచ్చు. డేటా అనాలసిస్, విజువలైజేషన్, డాక్యుమెంటేషన్, ఎక్స్‌సెల్, ఫీల్డ్ వర్క్ ఎబిలిటీ వంటి నైపుణ్యాలు ఉండాలి. ఇక అండర్/ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ క్వాలిపైడ్ యాస్పిరెంట్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక అయిన వారికి ప్రతి నెలా స్టైఫండ్ ఇస్తారు. అలాగే అకామిడేషన్ కూడా ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. 2024 ఆగస్ట్ 1 నుంచి 2025 జనవరి 31 వరకు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూలై 15 మాత్రమే.
No comments:
Post a Comment