వారములో 5 రోజులు మాత్రమే పనిదినములు. వారానికి రెండు రోజులు సెలవు దినములు.ఓవర్ టైమ్ క్రింద పనిచేయు వారికి రోజుకు రూ.1,275/- ఇవ్వబడును.
చిత్తూరు జిల్లాలోని నిరుద్యోగ గిరిజన యువతి, యువకులకు ప్రముఖ కంపెనీలలో ఉపాధి కోసం నిర్వహించే (జాబ్ మేళా) ఇంటర్వునకు హాజరు కాగలరని జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి ఎస్.మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.SK Safety Wings (P) Limited, (Amazon ఆధ్వర్యములో) Warehouse Associates, Picking, Packing, Scanning, Sorting Loading & Unloading మొదలైన విభాగాలలో పనిచేయవలసి ఉంటుంది.ఆసక్తి కలిగిన నిరుద్యోగ గిరిజన యువతి యువకుల ఈ నెల 17 న నిర్వహించే జాబ్ మేళా కార్యక్రమంలో నేరుగా వచ్చి పాల్గొనవచ్చునని తెలిపారు.
విద్య అర్హతలు:
అభ్యర్ధి వయస్సు 18 నుండి 35 సంవత్సరముల మధ్య ఉండాలి. 10వ తరగతి నందు ఉత్తీర్ణత సాధించి, ఇంగ్లీషుపై ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలి.
జీతము వివరములు:
నెలకు జీతము రూ.17,000/- నుండి రూ.19,000/- తో పాటు ESI, PF సౌకర్యాలు ఉంటాయి.భోజన, వసతి సౌకర్యములు అభ్యర్థులే భరించాలి.
పని వివరములు:
వారములో 5 రోజులు మాత్రమే పనిదినములు. వారానికి రెండు రోజులు సెలవు దినములు.ఓవర్ టైమ్ క్రింద పనిచేయు వారికి రోజుకు రూ.1,275/- ఇవ్వబడును.
ఉద్యోగము కల్పించు ప్రాంతము :
తమిళనాడు రాష్ట్రములోని చెన్నై నగరమునకు సమీపముగా గల పోన్నేరి మరియు గుమ్మడిపుండి ప్రాంతములు. కావున, జిల్లాలోని 10వ తరగతి ఆ పై ఉత్తీర్ణత సాధించి, ఇంగ్లీషుపై ఖచ్చితమైన అవగాహన కలిగిన నిరుద్యోగ గిరిజన యువతీ యువకులు( ఎరుకల, సుగలి,యానాది,గువ్వలలోలు,నక్కలోళ్లు) ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.
వీరు పూర్తి బయోడేటాతో పాటు వారి విద్యార్హత, కుల ధృవీకరణ పత్రము, రేషను కార్డు, ఆధారు కార్డు, పాసుపోర్టు సైజు కలర్ ఫోటోతో పాటు 10వ తరగతి నందు ఉత్తీర్ణత సాధించిన ధృవీకరణ పత్రము మరియు ఇతర సంబంధిత ధృవీకరణ పత్రము నకలులను గెజిటేట్ అధికారి వారిచే ధృవీకరించి (Attestation) సదరు బయోడేటాకు జతపరచాలన్నారు.
సదరు బయోడేటా తో పాటు నేరుగా కొత్త కలెక్టరేట్, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవనం, మొదటి అంతస్తు లోని జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయము, చిత్తూరు నందు 17-08-2024 (శనివారము) ఇంటర్వునకు హాజరు కాగలరు. ఏదైనా ఇతర సమాచారము కొరకు 08572-241056 నందు సంప్రదించగలరని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
Electrical
ReplyDeleteYes sir
ReplyDeleteAnand
ReplyDeleteAnandkill143
ReplyDeleteAnandkill143
ReplyDelete