Mother Tongue

Read it Mother Tongue

Friday, 9 August 2024

ఆ ఇండస్ట్రీలో మెగా హైరింగ్‌.. ఏకంగా 12.5 లక్షల కొత్త ఉద్యోగాలు!

 రాబోయే పండుగ సీజన్‌కి ఇ-కామర్స్ సెక్టార్‌లో గిగ్ వర్కర్స్‌, కాంట్రాక్టు సిబ్బంది నియామకాలు భారీగా పెరుగుతాయని స్టాఫ్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ టీమ్‌లీజ్ సర్వీసెస్ అంచనా వేసింది.

భారతదేశంలో ఈ-కామర్స్‌ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. క్రమంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. రానున్న ఫెస్టివల్‌ సీజన్‌లో ఈ-కామర్స్‌ సేల్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉంది.

అలానే రాబోయే పండుగ సీజన్‌కి ఇ-కామర్స్ సెక్టార్‌లో గిగ్ వర్కర్స్‌, కాంట్రాక్టు సిబ్బంది నియామకాలు భారీగా పెరుగుతాయని స్టాఫ్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ టీమ్‌లీజ్ సర్వీసెస్ అంచనా వేసింది.

నివేదికల ప్రకారం.. ఈ-కామర్స్ ఇండస్ట్రీ సేల్స్‌ గత ఏడాదితో పోలిస్తే ఈ ఫెస్టివల్ సీజన్‌లో 35% పెరగనున్నాయి. ఈ డిమాండ్‌ను హ్యాండిల్‌ చేయడానికి కంపెనీలు ఎక్కువ మంది కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నాయి. ఆఫీస్ పనులు, డెలివరీలు టైమ్ ప్రకారం జరిగేలా చూసేందుకు 10 లక్షల మంది గిగ్ వర్కర్లను, 2.5 లక్షల మంది కాంట్రాక్టు సిబ్బందిని.. మొత్తం 12.5 లక్షల మందిని నియమించుకోవాలని చూస్తున్నాయి.

ప్రస్తుతం క్విక్‌ కామర్స్‌ కంపెనీలు కొత్త నగరాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, బ్యూటీ ఐటెమ్స్‌, హోమ్ డెకర్, వెల్‌నెస్ ప్రొడక్టులు, ఇతర ప్రొడక్టులను అందిస్తున్నాయి. విభిన్న వర్గాల కస్టమర్ల అవసరాలను తీరుస్తూ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.

క్విక్‌ కామర్స్‌ కంపెనీలు వివిధ రకాల ప్రొడక్టులను అందిస్తూ ఆన్‌లైన్ సూపర్ మార్కెట్లుగా పనిచేస్తాయి. సీజనల్ డిమాండ్‌కి తగినట్లు, పండుగల కోసం తమ ఇన్వెంటరీని కూడా అడ్జస్ట్‌ చేసుకుంటాయి. గత సంవత్సరం మార్చి 24 నాటికి ఈ ఇండస్ట్రీ రోజుకు 20 లక్షల ఆర్డర్‌లను సాధించింది. రాబోయే పండుగ సీజన్‌లో ఈ రికార్డును అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఉపాధి, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం : టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌, ఎస్‌వీపీ, బిజినెస్ హెడ్ ఎ.బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ, ‘ఈ పండుగ సీజన్, ఈ-కామర్స్ అమ్మకాలను పెంచి, భారీ స్థాయిలో ఉద్యోగాలను సృష్టిస్తుంది. 10 లక్షల మంది గిగ్ వర్కర్లు , 2.5 లక్షల మంది కాంట్రాక్టు సిబ్బందికి అవకాశం ఇస్తుంది. ఉద్యోగ కల్పనలో ఈ-కామర్స్ రంగం పాత్ర గణనీయంగా ఉంటుంది. ఈ నియామకాలు ఉద్యోగ సృష్టిలో ఈ-కామర్స్‌ కీలక పాత్రను మాత్రమే కాకుండా, 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే భారతదేశం లక్ష్యానికి తోడ్పాటు అందిస్తుంది. 2026 నాటికి ఈ-కామర్స్ డిమాండ్‌లో 60% కంటే ఎక్కువ టైర్ 2, 3, 4 నగరాలు, గ్రామీణ భారతదేశం నుంచి వస్తాయని ఆశిస్తున్నాం.’ అని పేర్కొన్నారు.

ప్రభుత్వ మద్దతు : నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు డెలివరీలను మరింత తక్కువ ఖర్చుతో, ఎఫిషియంట్‌గా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ-కామర్స్ నియామకాల పెరుగుదలకు ఈ విధానం కీలక అంశం. హాలిడే సీజన్‌లో, ఆర్డర్‌లు త్వరగా, ప్రభావవంతంగా దేశవ్యాప్తంగా అందేలా చూస్తుంది.

ఈ-కామర్స్ సేవలకు డిమాండ్ పెరుగుతూనే ఉన్నందున, కంపెనీలు డెలివరీ సిబ్బంది, వేర్‌హౌస్‌ వర్కర్స్‌, కస్టమర్ సేవా ప్రతినిధులు, ప్యాకేజింగ్, లేబులింగ్, క్వాలిటీ కంట్రోల్‌, ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్‌ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో పండుగ సీజన్‌లో ఆర్డర్‌లలో ఆశించిన పెరుగుదలను హ్యాండిల్ చేసేందుకు, ఇండస్ట్రీ సిద్ధంగా ఉన్నట్లు సూచిస్తోంది.



2 comments:

  1. Good luck ur help nechr

    ReplyDelete
  2. ఎప్పుడు డేట్ ఇవ్వండి

    ReplyDelete

Job Alerts and Study Materials