ఐటిఐ చేసిన విద్యార్థులు అందరూ కూడా అప్లై చేసి తమ గమ్యాలను చేరుకోవాలని తెలిపారు. ఐటిఐ చేసిన విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఉత్తరాంధ్రలో ఐటిఐ చేసిన విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్
చెప్పింది. అప్రెంటిస్ షిప్ చేసి వివిధ రంగాల్లో స్థిరపడాలని అనుకున్న
విద్యార్థులకు ఇది సువర్ణవకాశం. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఏ.పీ.ఎస్
ఆర్టీసీలో అప్రంటిస్ షిప్ చేయడానికి అర్హులైన యువతీ యువకులు అన్లైన్లో
దరఖాస్తులు చేసుకోవాలని ఆర్టీసీ విజయనగరం జోనల్ స్టాప్ ట్రైనింగ్ కాలేజి
ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు Apprenticeship https://apprenticeshipindia.gov.in వెబ్సైట్లో ఆగస్టు ఒకటో తేదీ నుంచి 16వ తేదీ లోపు అప్రెంటిష్ షిప్ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
విశాఖపట్నం డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్,
పెయింటర్, ఫిట్టర్, డ్రాప్ట్మన్ (సివిల్), అల్లూరి సీతారామరాజు జిల్లాకు
డిజల్మెకానిక్, ఎలక్ట్రిషయన్, విజయనగరం జిల్లా డిజల్ మెకానిక్, మోటార్
మెకానిక్ ఎలక్ట్రిషియన్, చవెల్డ్ షీట్ మెటల్ వర్కర్, పెయింటర్,
మెషినిస్ట్బు పిట్టర్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్, పార్వతీపురం మన్యం డీజల్
మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్ వెల్డర్ , శ్రీకాకుళం జిల్లాకు
డీజల్ మెకానిక్ మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, డ్రాప్మెన్ సివిల్ కోసం
యువకులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
దీనికోసం ఎస్ఎస్పి మార్క్ లిస్ట్ ఐటీఐ మార్క్ లిస్ట్ కులధ్రువీకరణ పత్రం,
తహసీల్దార్ ధ్రువీకరించిన నివాస ధ్రువీరకరణ పత్రం, స్పోర్ట్స్, ఆధార్,
పీహెచ్సీ, బయాడేటా, ఎక్స్ సర్వీసుమెన్ (తండ్రి ధ్రువీరకరణ, పోస్టల్
చిరునామాతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విశాఖపట్నం, పార్వతీపురం మన్యం
జిల్లాలకు ఆగస్టు22న, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ విజయగనరం జిల్లాలకు
23న, అనకాపల్లి, ఆల్లూరి సీతరామరాజు , కాకినాడ జిల్లాలకు ఈనెల 24వ తేదీన,
తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు 27వ తేదీన సర్టిఫికేట్ల వెరిఫికేషన్
వుంటుందన్నారు.
ప్రాసెసింగ్ పీజు రూ.118తోపాటు మరో 18రూపాయలు జీఎస్ఈ చెల్లించిన రసీదు
పొందాలని ప్రిన్సిపాల్ కోరారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ వెబ్సైట్లో
పొందుపరచడం జరిగిందని తెలిపారు. ఐటిఐ చేసిన విద్యార్థులు అందరూ కూడా అప్లై
చేసి తమ గమ్యాలను చేరుకోవాలని తెలిపారు. ఉత్తరాంధ్రలో ఐటిఐ చేసిన
విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పైన తెలిపిన జిల్లాలు
ఆధారంగా ఆయా తేదీలు చూసుకొని సర్టిఫికెట్లు వెరిఫికేషన్ కి రావాలని
తెలిపారు. వచ్చేటప్పుడు ప్రతి విద్యార్థులు కూడా తమ వెంట అన్ని
సర్టిఫికెట్లు విధిగా తీసుకురావాలని తెలిపారు. వెరిఫికేషన్ చేసినప్పుడు ఏ
ఒక్క సర్టిఫికెట్ లేకపోయినా ఇబ్బందులు పడతారని తెలిపారు. వెరిఫికేషన్
తేదీలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆయా తేదీలకు అన్ని సర్టిఫికెట్లు
ముందుగా రెడీ చేసుకోవాలని తెలిపారు.
R and ac ki leva
ReplyDeleteHello bro
ReplyDelete8096159753
ReplyDelete