Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 7 August 2024

SBIలో 1100 పోస్టులు.. లాస్ట్ డేట్ దగ్గరపడింది.. వెంటనే ఇలా అప్లై చేయండి

 దేశీయ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో మేనేజర్, ఆఫీసర్, క్లర్క్, ఎకనామిస్ట్, బ్యాంకింగ్ అడ్వైజర్ తదితర పోస్టుల భర్తీ జరుగుతోంది. ఆ వివరాలు చూద్దాం..

దేశీయ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో మేనేజర్, ఆఫీసర్, క్లర్క్, ఎకనామిస్ట్, బ్యాంకింగ్ అడ్వైజర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (ఎకనామిస్ట్ అండ్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్) పోస్టులకు జులై 17న, స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (వీపీ వెల్త్, మేనేజర్, ఇతర పోస్టులు) పోస్టులకు జూలై 19, 2024న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమై కొనసాగుతోంది. వీపీ వెల్త్, మేనేజర్, ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 8, 2024.

ఇకపోతే ఎస్బీఐ ఆఫీసర్స్/ క్లరికల్ కేడర్​లో 8 విభాగాలు, క్రీడలకు స్పోర్ట్స్ పర్సన్ నియామకాల కోసం జులై 24న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వీటి దరఖాస్తు ప్రక్రియ 2024 ఆగస్టు 14న ముగుస్తుంది. అర్హులైన అభ్యర్థులు sbi.co.in ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఉన్న ఖాళీల వివరాలు చూస్తే.. వీపీ వెల్త్ : 643 పోస్టులు, రిలేషన్ షిప్ మేనేజర్: 273 పోస్టులు, క్లరికల్ (స్పోర్ట్స్ పర్సన్ ): 51 పోస్టులు, ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్: 39 పోస్టులు, రిలేషన్ షిప్ మేనేజర్- టీమ్ లీడ్: 32 పోస్టులు, ఇన్వెస్ట్ మెంట్ స్పెషలిస్ట్: 30 పోస్టులు, ఆఫీసర్స్ (స్పోర్ట్స్ పర్సన్ ): 17 పోస్టులు, రీజినల్ హెడ్: 6 పోస్టులు, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్ ): 2 పోస్టులు, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్ ): 2 పోస్టులు, ప్రాజెక్ట్ డెవలప్ మెంట్ మేనేజర్ (బిజినెస్ ): 2 పోస్టులు, ఎకనామిస్ట్: 2 పోస్టులు, డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ - ఆర్మీ: 1 పోస్టు, ప్రాజెక్ట్ డెవలప్ మెంట్ మేనేజర్ (టెక్నాలజీ): 1 పోస్టు ఉన్నాయి.

పోస్టును బట్టి అర్హత ప్రమాణాలు మారుతుంటాయి. జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు అన్ని పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. ఈ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్​ని చూడొచ్చు. అప్లికేషన్స్ లాస్ట్ డేట్ దగ్గరపడింది కాబట్టి అభ్యర్థులు అలర్ట్ కావాల్సిన సమయమిది.



4 comments:

  1. Apally link petandi sir

    ReplyDelete
  2. Apply link pettu guru

    ReplyDelete
    Replies
    1. Application link send mee sir

      Delete
  3. Shaik zainab begum8 August 2024 at 03:33

    Apply karne ka link mention karo please.

    ReplyDelete

Job Alerts and Study Materials