భారత నావికాదళంలో INCET (ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్)కు చాలా ప్రాధాన్యత ఉంది. నేవీలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి ఈ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తుంటారు. తాజాగా INCET నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
భారత నావికాదళంలో INCET (ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్)కు చాలా ప్రాధాన్యత ఉంది. నేవీలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి ఈ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తుంటారు. తాజాగా INCET నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 2లోపు అధికారిక పోర్టల్ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం.
* పోస్టుల ఖాళీలు
ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా మొత్తంగా 741 పోస్టులు భర్తీ కానున్నాయి. అందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 16, ఫైర్‌మెన్- 444, ట్రేడ్స్‌మన్ మేట్- 161, పెస్ట్ కంట్రోల్ వర్కర్- 18, ఫైర్ ఇంజన్ డ్రైవర్- 58, కుక్- 9, ఛార్జ్‌మెన్- 29, సైంటిఫిక్ అసిస్టెంట్- 4, డ్రాఫ్ట్స్‌మన్ - 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
* వయోపరిమితి
దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
పోస్టుల ఆధారంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆధారపడి ఉంటుంది. కొన్ని ఉద్యోగాలకు పదోతరగతి అర్హత కాగా, మరికొన్నిటికి డిప్లొమా, BSc డిగ్రీ తప్పనిసరిగా పాసై ఉండాలి.
* అప్లికేషన్ ప్రాసెస్
- ముందుగా అధికారికపోర్టల్ incet.cbt-exam.in ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలోకి వెళ్లి INCET-2024 అనే లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి.
- ఆ తరువాత ‘అప్లైనౌ’ అనే ఆప్షన్ క్లిక్ దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
- రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి, అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.
- అన్ని వివరాలను ఎంటర్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి, అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ చేయాలి.
* అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.295 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు.
* సెలక్షన్ ప్రాసెస్
ఇండియన్ నేవీలో INCET కోసం సెలక్షన్ ప్రాసెస్‌లో ముందు ఆన్లైన్ రాత పరీక్ష, ఆ తరువాత ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఆపైన మెడికల్ ఎగ్జామినేషన్, చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ అన్ని దశలను క్లియర్ చేసిన వారికి పోస్టింగ్ లభిస్తుంది.
* ఎగ్జామ్ ప్యాట్రన్
పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. మొత్తంగా నాలుగు సెక్షన్స్.. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఉంటాయి. ప్రతి సెక్షన్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. ప్రశ్నాపత్రం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ రూపంలో ఉంటుంది. పరీక్ష షెడ్యూల్‌ను త్వరలో ఇండియన్ నేవీ ప్రకటిస్తుంది.
* జీతభత్యాలు
ఎంపికయ్యే అభ్యర్థుల జీతభత్యాలను పోస్టుల ఆధారంగా ఇండియన్ నేవీ నిర్ణయిస్తుంది.
Indian Navy
ReplyDeleteYes
ReplyDeleteOkay sir
ReplyDelete