Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 3 July 2024

TGSRTCలో 3035 ఉద్యోగాలు.. అర్హత, జీతంతో పాటు పూర్తి వివరాలివే..

టీజీఎస్ ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీకి స్వీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించి ప్రజా మెప్పు పొందిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఎస్ ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీకి స్వీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి త్వరలో అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.

ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన మొత్తం 3035 పోస్టుల్లో అత్యధికంగా డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. వీటిలో డ్రైవర్ 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ (2) 114, డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) 84, DM/ATM/మెకానికల్/ఇంజనీర్ 40, డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ 25, మెడికల్ ఆఫీసర్ 14, సెక్షన్ ఆఫీసర్ (సివిల్) 11, అకౌంట్స్ ఆఫీసర్ 06, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 23, మెడికల్ ఆఫీసర్ 14, సెక్షన్ ఆఫీసర్ (సివిల్) 11, అకౌంట్స్ ఆఫీసర్ 06 ఉద్యోగాలు ఉన్నాయి.

ఉద్యోగాన్ని బట్టి అర్హత ప్రమాణాలు వేరువేరుగా ఉంటాయి. అభ్యర్థి వయస్సు 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. బీసీలకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంటుంది. పోస్టును బట్టి 10వ, 12వ, ITI, డిప్లొమా, డిగ్రీ లేదా PG పూర్తి చేసిన వారు అర్హులు. జీతం రూ. 25,500 నుండి రూ. 45,500 వరకు ఉండొచ్చు. ఉద్యోగ స్థాయి, అనుభవం ఆధారంగా జీతంలో మార్పులు ఉంటాయి.

ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల మంది పని చేస్తున్నారు. కారుణ్య నియామకాలు మినహా గత పదేళ్లుగా సంస్థలో కొత్త నియామకాలు జరగలేదు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ TGSRTCలో 3035 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



34 comments:

  1. Kk date yeppudu

    ReplyDelete
  2. 10th ejobe arahata

    ReplyDelete
  3. Iti electrician

    ReplyDelete
  4. I am interest

    ReplyDelete
  5. 12 పాస్

    ReplyDelete
    Replies
    1. Halo sir ala apply chesukovali

      Delete
  6. Mohan lal Dharavath

    ReplyDelete
  7. Replies
    1. How many post in conductor

      Delete
  8. Ela apply chesukovali

    ReplyDelete
  9. First change

    ReplyDelete
  10. ITI .9492004595

    ReplyDelete
  11. 10 th completed

    ReplyDelete
  12. ఏ ఉద్యగం నికి అర్హత వయసు

    ReplyDelete
  13. Diploma ye category

    ReplyDelete
  14. నిజమా అబద్దమా నా డేట్ ఇవ్వండి ఎప్పుడు అప్లై చేసుకోవాలో ఎక్కడ అప్లై చేసుకోవాలి దీంట్లో అప్లై చేసుకోవాలి చెప్పండి ప్లీజ్

    ReplyDelete
  15. Conductors posts is there are not please confirm conductors posts also

    ReplyDelete
  16. Ela application cheyalo chepandi & epati nindi

    ReplyDelete
  17. Degree complete

    ReplyDelete
  18. inter complete

    ReplyDelete
  19. Handicapped persons can apply this jobs.i completed MBA finance
    Please gve rply

    ReplyDelete
  20. అప్లై చేసినా డేట్ చెప్పగలరుపదో తరగతి పాస్

    ReplyDelete
  21. Accountund vacancy only 6a

    ReplyDelete
  22. డేట్ ఎప్పుడు కొంచెం చెప్పండి ప్లీజ్

    ReplyDelete
  23. Online lo apply chyala sir cheppandi

    ReplyDelete

Job Alerts and Study Materials