దేశంలో స్టార్టప్ కంపెనీలు కొత్తగా నలబై లక్షల ఉద్యోగాలు కల్పించాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం నిర్వహించిన రాష్ట్రీయ రోజ్ గార్ మేళా (Rozgar Mela) వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ప్రధాని డెబ్భై ఒక వేల మంది అభ్యర్థులకు అపాయిట్మెంట్ లెటర్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రీయ రోజ్ గార్ మేళా యువతకు ఉద్యోగాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తుందని మోదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కల్పన వేగంగా సాగుతోందన్నారు. రక్షణ శాఖకు కావాల్సిన 300 పరికరాలను మన దేశం ఉత్పత్తి చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి ఆయుష్ సర్బానంద సోనోవాల్ గువహటిలోని రైల్ రంగ్ భవన్ కల్చరల్ హాలులో కొత్త అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. మరో కేంద్ర మంత్రి రామేశ్వర్ తెలి దిమాపూర్ లో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. రోజ్‌గార్ మేళా డ్రైవ్‌లో భాగంగా 2024లో వచ్చే లోక్‌సభ ఎన్నికలలోపు పది లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ముద్ర పథకంతో దేశంలో 8 కోట్ల మందికి ఉపాధి లభించిందన్నారు. రూ.23 లక్షల కోట్ల రుణాలను ఇప్పటివరకు ఇచ్చామన్నారు. అత్యాధునిక ఉపగ్రహాల నుంచి సెమీ హైస్పీడ్ రైళ్ల వరకు అన్నింటినీ దేశంలోనే తయరు చేసి కోట్ల మందికి ఉపాధి కల్పించినట్లు ప్రధాని అన్నారు. 300కు పైగా పరికరాలు, ఆయుధాలను దేశీయంగా ఉత్పత్తి చేసుకుని.. దిగుమతులను తగ్గించుకోవడమే కాకుండా రూ.15 వేల కోట్ల విలువైన ఎగుమతుల్ని చేయగలిగామన్నారు. ఈ రోజ్ గార్ మేళాలో ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, సీనియర్ కమర్షియల్ కం టికెట్ క్లర్క్, ఇన్ స్పెక్టర్, సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుళ్లు, స్టెనోగ్రాఫర్లు, జూనియర్ అకౌంటెంట్లు, పోస్టల్ అసిస్టెంట్లు, ఆదాయపు పన్ను శాఖ ఇన్ స్పెక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, లైబ్రేరియన్, నర్సు తదితర ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు.

No comments:
Post a Comment