తెలంగాణలో(Telangana) ఎస్సై ఉద్యోగా ఖాళీల నియామకాలకు సంబంధించి తుది విడత రాత పరీక్షకు 96 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 08, 09 తేదీల్లో నిర్వహించిన పరీక్షలను తెలంగాణ వ్యాప్తంగా మూడు ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించారు. మొదటి రోజు మ్యాథ్స్, మరియు ఇంగ్లీష్ పేపర్(English Paper) లు జరుగగా.. ఏప్రిల్ 09 వ తేదీన జనరల్ స్టడీస్ మరియు తెలుగు పేపర్స్ పరీక్షలు జరిగాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లోని 81 కేంద్రాల్లో ఎస్‌ఐ రాత పరీక్షను జరిపించారు. ఎస్‌ఐ(సివిల్), ఎస్‌ఐ(ఐటీ), ఎస్‌ఐ(పీటీఓ), ఏఎస్‌ఐ(ఫింగర్ ప్రింట్) విభాగంలో 4 పేపర్లకు పోలీసు నియామక మండలి పరీక్షలు నిర్వహించింది. వేలి ముద్రలతో అభ్యర్థులను సరిపోల్చిన తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. త్వరలోనే వెబ్‌సైట్‌లో ప్రిలిమినరీ 'కీ' అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలియ పర్చారు. ఏప్రిల్ 08వ తేదీన.. హైదరాబాద్ లో మొత్తం 42 కేంద్రాలను కేటాయించగా.. దీనిలో 32,945 మంది హాజరయ్యారు. కరీంనగర్ జిల్లాల్లో 18 కేంద్రాలను కేటాయించగా.. 12,833 మంది హాజరయ్యారు. వరంగల్ జిల్లాలో 21 కేంద్రాలను కేటాయించగా.. మొత్తం 13,756 మంది హాజరయ్యారు. మొత్తం మీద 59,534 మంది హాజరయ్యారు. మొదటి రోజు 95.50 శాతంగా నమోదు అయింది. రెండో రోజు 58,019 మంది హాజరవ్వగా.. 95.47 శాతంగా నమోదైంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
No comments:
Post a Comment