ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న నిరుద్యోగులకు విశ్వభారతి విశ్వవిద్యాలం శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 709 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. విశ్వభారతి విశ్వవిద్యాలయానికి లైబ్రేరియన్, క్లర్క్, టైపిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ సిబ్బంది అవసరం. ఈ ఖాళీలకు నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేశారు. విశ్వ భారతి అసిస్టెంట్ లైబ్రేరియన్, లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ల్యాబ్ అటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్ సహా వివిధ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులకు సమర్పించాలి. విశ్వభారతి యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 16. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా విశ్వభారతి యూనివర్సిటీలో 709 మందిని నియమించనున్నారు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం, అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చెల్లించాలి. గ్రూప్ ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.2000, గ్రూప్ బీకి రూ.1200, గ్రూప్ సీకి రూ.900 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్ చేయబడిన కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుండి మినహాయింపు ఉంటుంది. రిజిస్ట్రార్, ఫైనాన్స్ ఆఫీసర్, లైబ్రేరియన్ పోస్టులకు 57 ఏళ్ల లోపు, డిప్యూటీ రిజిస్ట్రార్, సీనియర్ సిస్టమ్ అనలిస్ట్ 50 ఏళ్ల లోపు, టర్నల్ ఆడిట్ ఆఫీసర్ (ఆన్ డిప్యూటేషన్) - 56 ఏళ్ల లోపు, గ్రూప్ ఏ పోస్టులు - 40 ఏళ్ల లోపు, గ్రూప్ బీ పోస్టులు - 35 ఏళ్లలోపు, గ్రూప్ సీ పోస్టులు - 32 ఏళ్లలోపు. ఎంపిక ప్రక్రియలో పేపర్ I మరియు పేపర్ II ఉంటాయి. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్ష వెయిటేజీ 70 శాతం, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ వెయిటేజీ 30 శాతం ఉంటుంది.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ దరఖాస్తు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక సైట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment